పెద్దపల్లి ప్రాంతాన్ని క్రీడలకు నిలయంగా మారుస్తా….
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని అన్ని ఏరియాలను క్రీడలకు నిలయంగా మార్చేందుకు కృషి చేస్తానని, ప్రాంత ప్రజల క్రీడాకారుల సహకారం కూడా అవసరమని పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ అన్నారు. గురువారం రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో ఖేలోఇండియా అండర్ 13 బాలికల ఫుట్బాల్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ… యువతలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి సరైన ప్రోత్సాహం అందిస్తామని అన్నారు. క్రీడలు శారీరక దృఢత్వానికి మాత్రమే కాకుండా జీవితానికి కూడా ఉపయోగపడతాయని తెలిపారు. ఈ ప్రాంత క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో నిలిపే దిశగా కృషి చేస్తానని అన్నారు. బాలికలు క్రీడారంగంలో ముందుకు రావడం,తమ ప్రతిభను ప్రపంచానికి చూపడం ఎంతో అవసరమని తెలిపారు.ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్ రెడ్డి, మందమర్రి జిఎం దేవేందర్, పీఎం శ్యాంసుందర్,ఏసిపి రవికుమార్, సీఐ శశిధర్ రెడ్డి, రఘునాథ్ రెడ్డి, పల్లె రాజు, ఒడ్నాల శ్రీనివాస్, గోపతి రాజయ్య, అబ్దుల్ అజీజ్, యాకూబ్ అలీ,గాండ్ల సమ్మయ్య, శ్రీనివాస్ గౌడ్, సుదర్శన్ గౌడ్, మహంకాళి శ్రీనివాస్, అక్బర్ అలీ, రామడుగు లక్ష్మణ్, ఇప్పకాయల లింగయ్య, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, సీనియర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.