మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
నవాబుపేట మండలంలోని లోకి రేవు గ్రామంలో గురువారం గ్రామపంచాయతీ కార్యదర్శి రాము ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. గ్రామసభలో గ్రామ అభివృద్ధి పనులు సంక్రాంతి పండుగ దృష్టిలో ఉంచుకొని వీధిలైట్లు డ్రైనేజీలు క్లీన్ చేయడం పలు అభివృద్ధి పనులు గురించి చర్చించడం మరియు పెద్ద చెరువు ఆయకట్టు నీటి పారుదల, రైతు పొలాలకు పంట సాగు చేయుట గురించి తీర్మానించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఇ ప్రభు, మాజీ సర్పంచ్ ఎల్ కృష్ణయ్య గౌడ్, 5 వ వార్డ్ మెంబర్ బీజేపీ రజిత శ్రీనివాస్, నరసింహులు గౌడ్, లక్ష్మయ్య, బాలయ్య, చంద్రయ్య, శ్రీను రామాంజనేయులు, నారాయణ, జంగయ్య,నారాయణ, వెంకటయ్య, శ్రీను,రాజు, రాము, శ్రీశైలం, లక్ష్మయ్య, ఎన్ఆర్ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ ఆంజనేయులు, తదితరులు పాల్గొని గ్రామసభ విజయవంతం చేయడం జరిగింది