మదనపల్లెలో ఏపీఎస్పీ 8త్ బేటాలియన్ చిత్తూరు సీఐ మృతి..
చిత్తూరు(నేటి ధాత్రి) జూలై 26:
మదనపల్లెలో ఏపీఎస్పీ 8త్ బెటాలియన్ చిత్తూరు సిఐ మృతి చెందారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె రెడ్డీస్ కాలనీకి చెందిన కృష్ణా నాయక్(59) చిత్తూరు ఏపీఎస్పి 8త్ బేటాలియన్ సీఐ గా పనిచేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం సెలవులో మదనపల్లెకు వచ్చాడు. శనివారం ఉదయం బాత్రూంలో కుప్పకూలీ ఉండగా గమనించిన కుటుంబీకులు వెంటనే స్థానిక జిల్లా అస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి మార్గమధ్యంలోనే సీఐ మృతి చెందాడని చెప్పారు..