దుగ్గొండి,నేటిధాత్రి :
ఈనెల 14న ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్ 19 రెజ్లింగ్ పోటీలు హనుమకొండ జేఎన్ఎస్ ఇండోర్ స్టేడియంలో జరిగాయి. ఈ పోటీల నిర్వహణలో భాగంగా దుగ్గొండి మండల కేంద్రంలోని శ్రీ ఆదర్శవాణి హై స్కూల్ చెందిన బొమ్మగాని సాయి నిహాల్ 57 కేజీల విభాగంలో రాష్ట్రస్థాయికి ఎంపికైయ్యాడు. ఎంపికైన సాయి నిహాల్ నీ శ్రీ ఆదర్శవాణి విద్యాసంస్థల చైర్మన్ నాగనబోయిన రవి,డైరెక్టర్ బిక్షపతిలు పూల బొకేతో సన్మానించారు. చైర్మన్ రవి మాట్లాడుతూ ఈనెల 16 ,17 తేదీలలో హైదరాబాదులో జరుగు రాష్ట్రస్థాయిలో పోటీలలో మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సాయి నిహాల్ ను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మణికంఠ రవి కోచ్ ఇటికాల దేవేందర్ ,పిఈటి లు కార్తీక్, అంజద్, పాష, విజయ్, చైతన్య,చందన పాల్గొన్నారు.