తుమ్మేటి సమ్మిరెడ్డి పెంపుడు కుక్క మృతి.
జమ్మికుంట: నేటిధాత్రి
జమ్మికుంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తుమ్మేటి సమ్మెరెడ్డి నెల రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందారు. నెల రోజుల క్రితం సమ్మిరెడ్డి మృతితో అతని పెంపుడు కుక్క ప్రతిరోజు దిగాలు పడుతూ సమ్మిరెడ్డి చిత్రపటం వద్ద కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపిస్తూ వచ్చింది. మనుషులలో లేని విశ్వాసం కుక్క లో ఉండడం పలువురిని ఆశ్చర్యపరిచింది. విశ్వాసానికి మారుపేరైన సమ్మిరెడ్డి పెంపుడు కుక్క సోమవారం మృతి చెందింది. సమ్మిరెడ్డి మృతి చెందిన నెల రోజులకు కుక్క మృతి చెందడం ఆ కుటుంబ సభ్యులను తీవ్ర మనస్థాపానికి గురి చేసింది. ఓవైపు సమ్మిరెడ్డి మృతి నుండి కుటుంబ సభ్యులు బయటపడకముందే వారి కనుల ముందే ఆయన పెంపుడు కుక్క మృతి చెందడంతో కుటుంబ సభ్యులకు సమ్మిరెడ్డి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్కకు ఉన్న విశ్వాసం మనుషులకు లేదని సమ్మిరెడ్డి తో లబ్ధి పొందిన వారు కూడా ఆయనను మర్చిపోయిన ఆయన ఉప్పు తిన్న విశ్వాసానికి ఆ కుక్క మాత్రం దిగాలుతో మృతి చెందడం పలువురిని కంటతడి పెట్టించింది.