ఓటరు జాబితా పై అఖిలపక్ష సమావేశం
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :
ఓటరు జాబితా పై అభ్యంతరాలు ఉంటే మునిసిపల్ అధికారులను సంప్రదించాలని మునిసిపల్ కమిషనర్ చంద్రశేఖర్ అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా అలియాబాద్ పురపాలక సంఘం (20)వార్డుల డ్రాఫ్టు ఓటరు జాబితా పై వివిధ రాజకీయ పార్టీల నాయకులతో అలియాబాద్ మున్సిపల్ కార్యాలయలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డ్రాఫ్ట్ జాబితాలోని (20)వార్డుల్లో ఓటర్లను ప్రతి ఒక్కరూ సరి చూసుకోవాలని ఒక వార్డు లోని ఓటరు పేరు వేరే వార్డులో వచ్చినట్లయితే మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అదేవిధంగా కొత్తగా ఓటర్ నమోదు, తొలగించటం గురించి ఈఆర్ఓకి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్.ఓ వేణు గోపాల్, టీపీవో వికాస్, వివిధ రాజకీయ పార్టీల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.
