చెత్త నిలయంలా మారిన వాగు.. పట్టించుకోని మున్సిపాలిటీ..

చెత్త నిలయంలా మారిన వాగు.. పట్టించుకోని మున్సిపాలిటీ.

దుర్వాసనతో మగ్గుతున్న వాగు.. సంచులకొద్దీ వ్యర్ధాలను పారేస్తున్న వైనం.

వాగు నిండా చెత్త మూటలు.. ప్రజలకు దుర్వాసన తిప్పలు

చెత్త సేకరణలో అధికారుల అశ్రద్ధ : వాగులో పారబోస్తున్న వైనం

కోదాడ, నేటి ధాత్రి:

 

వాగులు, కాలువలు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసే వారిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం. కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని కోదాడ, ఖమ్మం రోడ్ లో గల తమ్మర వాగులో చెత్త ప్లాస్టిక్ ఇతర వ్యర్థ పదార్థాల మూటలను తీసుకువచ్చి వాగులో పడి వేయడంతో తీవ్ర దుర్వాసన వస్తుండడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు పారిశుధ్య నిర్వహణలో ముఖ్యంగా డంపింగ్ యార్డ్లకు చెత్తను తరలించడంలో విఫలమవుతున్నారా .

ఈ పారిశుద్ధ్య సమస్యలపై మున్సిపల్ అధికారులు, యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో భారీ వర్షాల వల్ల వరద నీరు పోవటానికి చెత్త వ్యర్థ పదార్థాల మూటల సంచులు మోరీ ఖానాలకు అడ్డుకట్టగా ఏర్పడడంతో వరద నీటి ప్రవాహం ఎటు పోలేని పరిస్థితుల్లో కాలనీలో వరద నీరు చేరి ప్రాణాపాయ స్థితిలో ఇరుక్కున్న కాలనీవాసుల పరిస్థితి తెలిసిన విషయమే దీనిపై అధికారులు ఇప్పటికైనా చెత్త వేస్తున్న వారిపై దృష్టి సారించాలని వారిపై తగు చర్యలు తీసుకోవాలి. చెత్త వేసే ప్రాంతాల్లో అధికారులు నిఘా పెంచాలని. సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించి జరిమానాలు విధించాలి. చెత్త వేసే ప్రదేశాలలో హెచ్చరిక బోర్డులు పెట్టాలి. అధికారులు చెత్త వేసే వారిపై జరిమానాన్ని విధించాలని స్థానిక ప్రజలు కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version