మెడికల్ బోర్డ్ వెంటనే ఏర్పాటు చేయాలి…
టీబీజీకేఎస్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
సింగరేణిలో యధావిధిగా మెడికల్ బోర్డు నిర్వహించాలని, నిలిచిపోయిన మెడికల్ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని టీబీజీకేఎస్ మందమర్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్ డిమాండ్ చేశారు.శనివారం టీబీజీకేఎస్ యూనియన్, బిఆర్ఎస్ నాయకులు కలిసి రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రి డివైసిఎంఓ మధు కుమార్ కు వినతి పత్రాన్ని అందించారు. కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏరియా ఉపాధ్యక్షులు మేడిపల్లి సంపత్ మాట్లాడారు. ఏసీబీ విచారణ పేరుతో మెడికల్ బోర్డును నిలిపివేయడం సరికాదని అన్నారు. ఏసీబీ, విజిలెన్స్ పేరిట మెడికల్ బోర్డును కాలయాపన చేయడం సరికాదని, రాష్ట్ర ప్రభుత్వ తీరును కార్మిక లోకమంతా గమనించాలన్నారు .ప్రభుత్వం స్పందించి వెంటనే మెడికల్ బోర్డును పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈనెల 30న అన్ని ఏరియా ల జిఎం కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు కృష్ణ, సురేష్, దబ్బేటి సంతోష్,బిఆర్ఎస్ నాయకులు రామిడి కుమార్, జాడీ శ్రీనివాస్,మహేందర్ రమేష్, రామిడి లక్ష్మీ కాంత్ చంద్రకిరణ్, రాజు తదితరులు పాల్గొన్నారు.
