“హరీష” గుండె ధైర్యానికి సలాం!

బలం బలగం బిఆరఎస్ సొంతం!

`కృష్ణర్జునుల సక్యత కు సంకేతం. ఐక్యతకు ఆదర్శం.

`పార్టీ నాయకుల్లో వున్న ధైర్యానికి నిదర్శనం.

`హరీష్ కు నోటీసులతో కదలిన యంత్రాంగం!

`తెలంగాణా నలు దిశల నుంచి వచ్చిన బిఆర#వతీతీ#స్ అభిమానజనం.

`ఒక్కసారిగా ఉలిక్కిపడిన కాంగ్రెస్ ప్రభుత్వం.

`సిట్ కార్యాలయానికి చేరుకున్న వేలాది మంది బి ఆర్ ఎస్ కార్యకర్తలు.

`లాఠీ ఛార్జ్ చేసి చెదరగొట్టినా కదలని కార్యకర్తలు.

`హరీష్ రావును సాక్షి గా మాత్రమే పిలిచారు?

`పాలక పక్షం మీడియా తెలిసినా పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేసింది?

`అర్ధం కాని మీడియా హడావుడి చేసింది?

`సందిట్లో సడెమియా లాగా కవిత జొర్రాలని చూసింది?

`హరీష్ రావు మీద ఆగ్రహంతో తన సోషల్ మీడియాలో ప్రాపగండ ప్రచారం చేయాలని చూసింది?

`ప్రజల్లో హరీష్ రావు మీద వున్న అభిమానం పెల్లుబికింది?

`జనమంతా ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు?

`హరీష్ ను అరెస్ట్ చేస్తారన్న వార్తలతో జనంలో ఆగ్రహం వ్యక్తమైంది?

`బీఆరఎస్ కార్యకర్తలు ఉప్పెనలా వచ్చేలా వున్నారని ఇంటెలిజెన్స్ కు ఉప్పందింది?

`ప్రభుత్వంలో వణుకు మొదలైంది?

`కొద్దిసేపటికే హరీష్ సిట్ కార్యాలయం నుంచి చిరునవ్వులు చిందిచ్చుకుంటూ వచ్చారు?

`అది చూసి గిట్టని వాళ్ళు కుళ్ళకున్నారు?

`కేటీఆర్,హరీష్ ల చిరునవ్వులు కొందరి గుండెలు అదిరేలా చేశాయి.

`బీఆరఎస్ బలమేమిటో, హరీష్ దైర్యం ఎంతటిదో కాంగ్రెస్ కు తెలిసింది.

`హరీష్, కేటీఆర్ ల అలింగనం చూసి ఓర్వలేని ఓ వర్గం మీడియా మళ్ళీ కట్టు కథలు అల్లింది?

`అబద్దాలు తెల్లారే సరికల్లా వందలు వండి వార్చింది?

`తెలంగాణా ఉద్యమ గుండెను బయపెట్టడం ఎవరి తరం కాదని తేలింది?

`తెలంగాణా కోసం కొట్లాడిన వాళ్ళకే ఉద్యమ కారుల తెగింపు తెలుసు?

`ఉప్పెనలాంటి ఉద్యమ పార్టీని ముట్టుకుంటే ఎలా వుంటుందో మరోసారి ప్రభుత్వానికి తెలిసింది.

`కాంగ్రెస్ పార్టీ గుండెల్లో వణుకు మొదలైంది?

`సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత కక్ష కాంగ్రెస్ మెడకు చుట్టుకునేలా వుంది?

`బీఆరఎస్ హయాంలో ఏ కాంగ్రెస్ నాయకులను వేదించలేదు?

`తన వ్యక్తి గత కక్షను చోపించుకునే ప్రయత్నం సీఎం చేస్తున్నారు?

`సీఎం రేవంత్ మూలంగా అనవసరంగా కాంగ్రెస్ నాయకులు నష్టపోయే పరిస్థితి తెస్తున్నారు?

 

 ఓర్పు అనే పదానికి పర్యాయపదం హరీష్‌రావు అని చెప్పాల్సిందే. అందుకు ఆయనను పని రాక్షసుడు అని కూడా అంటారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ ప్రభుత్వం హరీష్‌రావు ఆత్మస్ధైర్యం కొంచెమైనా దెబ్బతీయాలని పదే పదే ప్రయత్నం చేస్తోంది. అయినా బెనకని, తొకలని గుండెధైర్యం హరీష్‌రావుది అని పదే పదే రుజువౌతూనే వుంది. ఓ వైపు ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఓ లొట్టపీసు కేసు అని అటు కేటిఆర్, ఇటు హరీష్‌రావులు ఇప్పటికీ వందల సార్లు చెప్పారు. అందులో కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేని కేసని వాళ్లే చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది పాలకులు సంబందించింది కాదని, చట్టానికి మాత్రమే పరిమితమైందని కూడా గతంలో కేసిఆర్ స్పష్టంగా , సూటిగా చెప్పారు. అయినా దానిలో ఏదో తేల్చుతామని కంకణం కట్టుకొని రేవంత్ సర్కారు రెండేళ్లుగా లాగుతూ వస్తోంది. కేటిఆర్, హరీష్‌రావుల ఆత్మస్ధైర్యం దెబ్బతీయాలని విశ్వ ప్రయత్నం చేస్తూనే వుంది. ఉద్యమ కాలంలోనే రాజకీయాల్లో రాటు దేలిన నాయకులు హరీష్‌రావు, కేటిఆర్. స్వరాష్ట్ర సాదన కోసం జీవితాలను ఉద్యమ మార్గంలోకి తెచ్చుకొని పోరాటం చేసిన వారికి రాష్ట్రాభివద్ది, ప్రజా ప్రగతి ఆరాటముంటుందే కాని, వ్యక్తిగత లక్ష్యాలు వుండవన్న సంగతి ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోలేకపోతోంది. పదే పదే బిఆరఎస్ నాయకలను ఇబ్బందులు పెట్టాలని చూస్తూనే వుంది. రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన చూస్తుంటే ప్రతిపక్షాల మీద పగసాదిస్తా అనేలా వుందేకాని,ప్రజలకు సేవ చేస్తామన్నట్లు కనిపించడం లేదన్న మాటలే సర్వత్రా వినిపిస్తుంది. ప్రతిపక్షం అనేది వున్నదే ప్రశ్నించడానికి, పాలకపక్షాన్ని దారిలో పెట్టడానికి అనేది రాజకీయం తెలిసిన ప్రతి ఒక్కరికీ తెలుసు. కాని రేవంత్ సర్కారు మాత్రం ప్రతిపక్షాలు ప్రశ్నించొద్దు. ప్రజలకు లేనిపోనివి చెప్పొదు. ప్రజýను చైతన్యం చేయొద్దు? ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయమని అడగొద్దు? ఇచ్చిన మాట తప్పితే మోసమని అనొద్దు? ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఎప్ప్పుడిస్తారన్న మా{ మాట్లాడొద్దు? ప్రభుత్వం చేసుకుంటూ పోయేదాన్ని చూసుకుంటూ వుండాలే తప్ప, ఇదేం పాలన అని కలలో కూడా అనుకోవద్దన్నట్లే వుంది. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా తీరు. పైగా ప్రజలకు ఏం చేస్తామన్నదానిని చెప్పడానికి తీరిక లేదు. బిఆరఎస్ పార్టీ ప్రభుత్వంలో వున్నప్ప్పుడు అంతా అవినీతి చేసింది? దాన్ని తొవ్వితీయమే మా పని అన్నట్లు ప్రభుత్వం పనిచేస్తుందే గాని, ప్రజలకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సంక్షేమ పాలన అందిద్దామన్న ఆలోచన మచ్చుకైనా కనిపించడం లేదు. అయినా బిఆరఎస్ అదికారంలో వున్నప్ప్పుడు ఏ కాంగ్రెస్ నాయకుల మీద ఇలా పదే పదే వేధింపులు చేయలేదు. ఏ నాయకుడి మీద గతం తాలుకూ పాలనపై తవ్వకాలు జరపలేదు. తెలంగాణ వచ్చింది. తెచ్చుకున్న తెలంగాణ ఎలా బాగు పడాలి. ఎలా పంటలు పండాలి. ఎలా నీళ్లు తెచ్చుకోవాలి. ఎలా నిధులు సమకూర్చుకోవాలి. ఎలా నియామకాలు చేపట్టాలి. అన్ని రంగాలలో తెలంగాణను ఎలా అభివద్ది చేసుకోవాలి అనే విషయాల మీద దష్టి తప్ప ప్రతిపక్షం మీద దష్టిపెడితే తెలంగాణ ఇలా వుండేది కాదు! కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో నూÅ£లు వుండేవి కాదు? అయినా రాజకీయాలంటే క్షక్షలు కాదు. రాజకీయాలంటే ఆదిపత్యం కాదు. ప్రజాసేవ. అది మర్చిపోయి సిఎం. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకులను పదే పదే టార్గెట్ చేస్తూ, పాలన గాలికి వదిలేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. సమయం వచ్చినప్ప్పుడు వారు చేయాల్సిన పని వారు చేస్తారు. ప్రజలు తమకు అధికారం ఇచ్చింది బి ఆరఎస్‌నే వేదించడానికి, బిఆరఎస్‌ను ఇబ్బందుల పెట్టుడానికి అనే ఆలోచనతోనే వున్నట్లున్నారు. రెండేళ్ల వ్యవది పూర్తయింది. ఎంతో విలువైన సమయం కరిగిపోయింది. ఈ రెండేళ్ల కాలంలో కాళేశ్వరంలో మిగిలిపోయిన పనులేమైనా చేశారా? లేదు! పెండింగ్ ప్రాజెక్టులనేమైనా పూర్తి చేశారా? అదీ లేదు. ఏం చేశారు అంటే బిఆరఎస్‌ను ఇబ్బందుల పెడుతున్నామని చెప్ప్పుకోవడం తప్ప మరేం లేదు. ఎన్నిసార్లు కేసులు, ఎన్ని కేసులు, ఎన్ని సార్లు నోటీసులు, ఎన్ని సార్లు విచారణలు. ఎంత కావాలని ప్రభుత్వం ప్రతిపక్ష బిఆరఎస్ అధినేత కేసిఆర్, అగ్రనేతలు కేటిఆర్, హరీష్‌లను ఇబ్బందులు పెట్టాలని చూస్తే ఏమొస్తుంది. ప్రజలు ఇచ్చిన సమయం వధా కావడం తప్ప మరేం ఒనగూరదు. అయినా బిఆరఎస్ అధికారంలో వున్నప్ప్పుడు ప్రస్తుతం మంత్రులుగా వున్న వారిలో ఏ ఒక్కరినీ ఇబ్బంది పెట్టలేదు. ఎమ్మెల్యేలలో ఎవరినీ కేసుల్లో ఇరికించలేదు. సిఎం. రేవంత్‌రెడ్డిని కూడా ఏనాడు పట్టించుకోలేదు. అయినా తన ఉనికి కోసం, తన రాజకీయం ఉన్నతి కోసం, తన లక్ష్యం కోసం రేవంత్ ఉరుకులాడిండు. అందులో సక్సెస్ అయ్యిండు. మిగతా నాయకుల్లా వుంటే, తాను అనుకున్న లక్ష్యం నెరవేర్చుకోలేనని తన వ్యక్తి గత ప్రయోజనాల కోసం పని చేశాడే తప్ప కాంగ్రెస్ మేలు కోసం చేసిందేమీ లేదు. ప్రజల కోసం చేసినట్లు ఏమీ కనిపించడం లేదు? అయినా రేవంత్ రెడ్డి మీద కేసిఆర్ ఏనాడు దష్టిపెట్టలేదు. రేవంత్‌ను ఇబ్బందులు పెట్టాలని ఎవరూ అనుకోలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని విఫల రాష్ట్రంగా, బిఆరఎస్ ప్రభుత్వాన్ని కూలదోయాలని ప్రయత్నం చేస్తున్నప్ప్పుడు పాలకులు చేతులు కట్టుకొని కూర్చుంటారా? అయినా రేవంత్ రెడ్ది ఎమ్మెల్యే కొనుగోలు కేసు అనేది రాజకీయంగా కరక్టే కావొచ్చు? కాని నైతికంగా తప్ప్పు. తెలంగాణ అస్దిత్వత్వాన్ని దెబ్బతీయాలని చూడడం అంతకన్నా పెద్ద తప్ప్పు! పద్నాలుగేళ్ల సుధీర్ఘ పోరాటంతో సాధించుకున్న తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తి మీద వుంది. అలాంటిది ప్రజా ప్రతినిదులకు ఇంకా ఎంత బాద్యత వుండాలి? ఆ బాధ్యతను సిఎం. రేవంత్ రెడ్డి విస్మరించారు. బిఆరఎస్‌ను గద్దెదించాలనుకున్నారు. దాని తర్వాతకూడా రాజకీయంగా ఉద్యమం పేరుతో బిఆరఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలు పెట్టారు. ప్రజల దష్టిలో పడేందుకు అనేక సంచనాలు చేశారు. దానికి కూడా బిఆరఎస్ అడ్డుకోలేదు. ప్రభుత్వాన్ని ఆనాడు పడగొట్టడం అనేది ఆయన దష్టిలో మంచిదే అయినప్ప్పుడు, రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన కర్తవ్యం కేసిఆర్ వుంది. అలా పెరిగిన రాజకీయ వైరం చివరకు రేవంత్‌ను సిఏం.ను చేసింది. అందుకు సంతోషించాల్సిందిపోయి, పదే పదే నిత్యం ఏదో రకమైన వివాదాలను సష్టించి కేసిఆర్‌ను వేదించడం సరైంది కాదు. పైగా తెలంగాణ తెచ్చిన నాయకుడైన కేసిఆర్‌పై ప్రతిసారి నోరు పారేసుకోవడం కూడా ఏమాత్రం మంచిది కాదు. ఇక కేటిఆర్, హరీష్‌రావులను నోటికొచ్చినట్లు తెట్టడమనేది గొప్ప అనుకుంటున్నారు. అదికారం వుందని, అధికారులు తమ చేతుల్లోవున్నారని కేటిఆర్, హరీష్‌రావులను రెచ్చగొట్టి, కేసులు నమోదు చేయాలని పదే పదే చేస్తున్నారు. కాని ఎక్కడా కేటిఆర్, హరీష్‌లు దొరకడం లేదు. కాళేశ్వరం కేసు నమోదు చేశారు. ఎలాగైనా హరీష్‌ను జైలకు పంపాలని చూశారు. కాని కుదరలేదు. కమీషన్ వేశారు. మంత్రుల తో కూడిన కమిటీ వేశారు. ఏమీ తేలలేదు. ఇక ఫార్ములా కేసు అని పెట్టి కేటిఆర్‌ను వేధించాలిని చూశారు. కేసులు నమోదు చేశారు. విచారణకు పిలిపించారు. అందులో కూడా ఏం చేసే అవకాశంలేదని తేలింది. ఇక ఫోన్ ట్యాపింగ్ అంటూ రెండేళ్లుగా సాగదీస్తున్నారు. మీడియాలో అదిగో, ఇదిగో అరెస్టు అంటూ వార్తలు రాయిస్తున్నారు. హరీష్‌ను జైలుకు పంపాలని చూశారు. హైకోర్టు హరీష్‌ను ముట్టుకోవద్దని తీర్పునిచ్చింది. ప్రభుత్వంఏకంగా సుప్రింకోర్టును ఆశ్రయించింది. హరీష్ కూడా తన వాదనలు సుప్రింకోర్టులో వినిపించారు. అక్కడ కూడా సుప్రింకోర్టు హరీష్‌కు క్లీన్ చీట్ ఇచ్చింది. హరీష్‌ను అరెస్టు చేయొద్దు. ఆయనపై కేసులు నమోదు చేయొద్దని తేల్చి చెప్పింది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో హరీష్ పాత్ర అనేది ఎక్కడా కనిపించలేదని కూడా సుప్రింకోర్టు చెప్పడంజరిగింది. దాంతో ఎలాగైనా కేటిఆర్, హరీష్‌లను అరెస్టు చేయాలంటే కుదరడం లేదు. ఆ అవకాశం రావడం లేదు. ఎందులోనూ సరైన ఆదారాలు లేవు. సాక్ష్యాలు అంతకన్నా లేవు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. ప్రజలు రేవంత్‌ను పదే పదే అడుగుతున్నారని, ఎప్ప్పుడు ముగ్గురు నాయకులను అరెస్టు చేస్తారని సభల్లో రేవంత్ చెబుతున్నారు. తన వ్యక్తిగత కక్షకు ప్రజలకు ఏం సంబంధం???

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version