*ఘనంగా ‘మత్స్యకార సేవ’ కార్యక్రమం..
*వర్చువల్‌గా పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
*తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి హాజరైన జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, కలెక్టర్ వెంకటేశ్వర్..
*పాల్గొన్న తుడా చైర్మన్, ఎస్పీ,జేసీ, పలువురు శాసనసభ్యులు మరియు కార్పొరేషన్ చైర్మన్ లు
తిరుపతి(నేటిధాత్రి:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మత్స్యకార సేవ
విడియో కాన్ఫరెన్స్ మీటింగ్‌లో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నందు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు తో కలిసి తుడా చైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి సందేశాన్ని, మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వారు ఈ సందర్భంగా లబ్ధిదారులకు వివరించారు.
ఈ ఉన్నత స్థాయి సమావేశంలో తిరుపతి జిల్లాకు చెందిన పలువురు శాసన
