ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
అలనాటి జ్ఞాపకాలను మదిలో పెట్టుకొని ఆప్యాయతను పంచుకోవడానికి ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నారు రామకృష్ణాపూర్ ప్రభుత్వ బాల బాలికల పాఠశాలలో 2001-2002 సంవత్సరంలో విద్యాబుద్ధులు నేర్చుకున్న విద్యార్థులు. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బీమా గార్డెన్ విద్యార్థులకు వేదికగా మారింది. 24 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంతో స్నేహా బంధాన్ని పెంపొందించుకున్నారు ఆనాటి విద్యార్థులు. ముందుగా విద్య నేర్పిన గురువులకు స్వాగతం పలికి ఘనంగా సత్కరించుకున్నారు. గురువులు చెప్పిన మాటలు శ్రద్ధగా వింటూ విద్యార్థులు లాగా మారి సంతోషంగా గడిపారు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒకరికొకరు పలకరించుకుంటూ సందడి చేశారు. తిరిగిరాని మధుర క్షణాలను గుర్తుచేసుకొని బావోద్వేగానికి గురయ్యారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆటపాటలతో ఆనందంగా గడిపారు. ఆపదలో ఉన్న తోటి మిత్రులకు తోడ్పాటును ఇవ్వాలని ఆనాటి విద్యార్థులందరూ నిర్ణయించుకున్నారు. పాఠాలు నేర్చుకున్న తమ విద్యార్థులు పలు రంగాలలో స్థిరపడటం గర్వంగా ఉందన్నారు ఉపాధ్యాయులు. పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి తోటి విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు
