నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట మండలంలోని కమ్మపెల్లి గ్రామంలో గల నేతాజీ పురుషుల పొదుపు సంఘం సభ్యుడు తంగెళ్ల ఎల్లయ్య గత కొన్ని రోజులుగా క్రితం మృతిచెందాడు.కాగా శనివారం సంఘం అధ్యక్షుడు గంగిడి రాజిరెడ్డి అధ్యక్షతన పాలకవర్గం దుగ్గొండి పురుషుల పొదుపు సమితి అధ్యక్షుడు మహమ్మద్ ఉస్మాన్ తో కలిసి సామూహిక నిధి పథకం విపత్సాహాయం రూ.60 వేలు,అభయనిధి పథకం విపత్సాహాయం రూ.10 వేలు మొత్తం 70 వేల రూపాయలు మృతిని బార్య స్వరూపకు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పెండ్యాల మల్లేశం, పాలకవర్గ సభ్యులు చిట్టోజు రాము, సాంబరాతి రమేష్, పంజాల రాజు, పంజాల భాస్కర్, మెరుగు రాజు, ఒద్దుల బుచ్చిరెడ్డి,వలుగుబెల్లి మోహన్ రెడ్డి, కోమాండ్ల శ్రీనివాస్ రెడ్డి, ఘణకుడు దూపటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.