శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు నేటి నుండి ప్రారంభమయ్యాయని ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు గో నూరు యాదగిరి పట్టణ అధ్యక్షులు ఆకుతోట దేవరాజ్ కోశాధికారి దాచ శివకుమార్ యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ మహిళా సంఘం అధ్యక్షురాలు కలకొండ భాగ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు నేడు అమ్మవారికి గౌరీ దేవి అలంకరణ 16న అన్నపూర్ణాదేవి అలంకరణ 17న బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణ 18న గాయత్రీ దేవి అలంకరణ 19 న లలితా దేవి అలంకరణ 20 న లక్ష్మీదేవి అలంకరణ 21న సరస్వతి దేవి అలంకరణ దుర్గాదేవి అలంకరణ 23న మహిషాసుర మర్దిని దేవి అలంకరణ శ్రీ రాజా రాజేశ్వరి దేవి అలంకరణ 24న మంగళవారం సాయంత్రం5 గంటలకు విజయదశమి సందర్భంగా రావణ సింహరా కమిటీ ఆర్యవైశ్య సంఘం యువజన సంఘం ఆధ్వర్యంలో రావణ సింహాల కార్యక్రమం హై స్కూల్ గ్రౌండ్ లో ఉంటుందని 25న కలకత్తా కాశి దేవి అలంకరణ సాయంత్రం 4 గంటలకు అమ్మవారిని ప్రత్యేక వాహనంపై పురవీధుల గుండా నంది కోళ్ల సేవ దాండియా భజన కోలాటములతో శోభాయాత్ర కలస కలశ నిమజ్జన కార్యక్రమం ఉంటుందని వారు తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version