కొనరావుపేట, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూరు గ్రామంలో మెరుగు ప్రసాద్ అను వ్యక్తిపై హత్య ప్రయత్నం చేసిన నిందితులను ఈరోజు పట్టుకొని వారి వద్ద నుండి హత్యా ప్రయత్నంకు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీన పరుచుకొని రిమాండ్కు తరలించనైనది నిందితుల వివరాలు మెరుగు అశోక్ తండ్రి బుచ్చిరాజం వయసు 32 సంవత్సరాలు 2. మెరుగు బుచ్చి రాజం తండ్రి పోశయ్య వయసు 70 సంవత్సరాలు మరియు మెరుగు తిరుపతి తండ్రి బుచ్చిరాజం వయసు 35 సంవత్సరాలు అందరూ కొలనూరు గ్రామానికి చెందినవారు మరియు తండ్రి కొడుకులు.
గత రాఖీ పండుగకు ముందు మెరుగు ప్రసాద్ మరియు నిందితుడు మెరుగు అశోకు మధ్యలో గొడవ జరిగినాదని అపుడు ప్రసాద్, అశోక్ ను గాయ పరిచినాడని అట్టి దాన్ని మనసులో పెట్టుకొని ప్రసాదును చంపాలనే ఉద్దేశంతో అశోకు తన తండ్రి బుచ్చిరాజం మరియు అన్న తిరుపతి తో కలిసి తేదీ 27 9 2023 రోజున రాత్రి అందాద 8 నుండి 8:30 గంటల మధ్యలో పథకం ప్రకారం ప్రసాద్ ను అశోక్ తమ ఇంటి ముందుకు తీసుకపోయి ముగ్గురు కలిసి గొడ్డలితో తలపై చేతిపై నరికి మూతి పై గుద్ధి వీపులో కొట్టి గాయపరిచి అతను ఎలాగు చనిపోతాడని నిర్ణయించుకుని అతను ప్రమాదవశాత్తు పడి గాయాలై చనిపోయినాడు అని అందరూ అనుకోవాలని అందరూ కలిసి బుచిరాజం ఇంటికి వెళ్ళి రక్తం బట్టలు విప్పి బకెట్లీ పెట్టి తరువాత అశోకు ప్రసాద్ యొక్క ఇంటికి వెళ్లి అతని తల్లిదండ్రులతో ప్రసాదు తన ఇంటి ముందు రోడ్డు మీద పడి రక్త కాయలతో ఉన్నాడని తీసుకువెళ్లండి అని చెప్పి తర్వాత తన తండ్రి ఇంటి దగ్గర ముగ్గురు కలిసి మాట్లాడుకుని తప్పించుకుపోయినారు ఈరోజు బుచ్చిరాజం ఇంటి వద్ద ముగ్గురు ఉన్నారని సమాచారం మేరకు ఎస్సై తన సిబ్బందితో యుక్తంగా వెళ్లి పట్టుకొని విచారించి పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి రిమాండ్ కు తరలించడం అయినది.