పరకాల నేటిధాత్రి(టౌన్)
హనుమకొండ జిల్లా పరకాల పట్టణం 14వ వార్డులో స్వచ్ఛ హీ సేవ కార్యక్రమం ప్రారంభించిన స్థానిక కౌన్సిలర్ మార్క ఉమాదేవి రఘుపతి గౌడ్.ఈ కార్యక్రమంలో భాగంగా 14వ వార్డులో గల ప్రభుత్వ పాఠశాల ఆవరణలో పరిశుభ్రత కోసం శ్రమదానం చేసి పిచ్చి మొక్కలు చెత్త చుట్టుపక్కల పరిసర ప్రాంతం మొత్తం శుభ్రపరచడం జరిగింది.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు,బిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.