జులై 9 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కదలిరండి
జిల్లా ప్రధాన కార్యదర్శులు క్యాతరాజు సతీష్, రమేష్
భూపాలపల్లి నేటిధాత్రి
నాలుగు లేబర్ కోడ్స్ రద్దు కనీస వేతనాల అమలు ఉద్యోగ భద్రత తదితర సమస్యల పరిష్కారం కోసం జూలై 9 దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వర్తిక సమ్మెలో కార్మికవర్గం పెద్ద ఎత్తున పాల్గొనాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతరాజు సతీష్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నూరు రమేష్ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా తెచ్చిన నాలుగు లేబర్ కొడ్స్ కార్మికుల యొక్క హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయని వాటి రద్దు కోసం కార్మికులు ఉద్యమించాల్సిన అవసరం వచ్చిందని వారు అన్నారు 1885 చికాగో అమరవీరుల పోరాట స్ఫూర్తితో సాధించుకున్న 8 గంటల పని దినాన్ని 29 కార్మిక చట్టాలను నాలుగు కొడ్స్ గా మార్చి కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసిందని వారు అన్నారు. 1948 లో వచ్చిన కనీస వేతన చట్టాన్ని పక్కకు పెట్టి కేవలం బడా పెట్టుబడిదారులకు పారిశ్రామికవేత్తలకు లాభం చేకూర్చే విధంగా ఒకరోజు కనీస వేతనాన్ని 178 రూపాయలుగా నిర్ణయించడం దుర్మార్గమని వారు అన్నారు. ఈ దేశానికి సంపద సృష్టికర్తలు కార్మికవర్గం అయితే మోడీ మాత్రం దేశానికి సంపద సృష్టికర్తలు పారిశ్రామికవేత్తలు బడా పెట్టుబడిదారులని చెప్పడం కార్మిక వర్గాన్ని అవహేళన చేయడమేనని వారు అన్నారు.. అందులో భాగంగా 1975 లో వచ్చిన ఆక్టాయిడ్ ఫార్ములా పారిశ్రామిక వివాదాల చట్టం వీటన్నిటిని ఏవి పరగణలోనికి తీసుకోకుండా మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా 29 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తుందని వారు తీవ్రంగా విమర్శించారు.. అందులో భాగంగా ఒకవైపు కనీస వేతనాన్ని పెంచాలని కార్మికులు పోరాటం చేస్తుంటే పరిధినాన్ని తగ్గించమని అడుగుతుంటే మోడీ తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ లో భాగంగా గుజరాత్ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలు కార్మికుల యొక్క పని దినాన్ని 10 గంటలుగా నిర్ణయించడం బడా పెట్టుబడి పారిశ్రామికవేత్తలకు మోడీకి మేలు చేకూర్చే విధంగా ఉన్నాయని వారు విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో కార్మికవర్గం పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో నాయకులు వేముల శ్రీకాంత్, జంపాల పవన్ సిఐటియు వెలిశెట్టి రాజయ్య తోపాటు కార్యకర్తలు పాల్గొన్నారు