గణపురంలో ఘనంగా 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో 79 వ స్వతంత్ర దినోత్సవవేడుకలను శుక్రవారం ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, కార్యాలయాలు,వివిధ రాజకీయ పార్టీల నాయకులు,యువజన, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.జాతీయ జెండాలు ఎగుర వేసి, స్వీట్లు పంపిణీ చేశారు. తహసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ తహసిల్దార్ మధురకవి సత్యనారాయణ స్వామి మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక అధికారి అసోద కుమారస్వామి,పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఐ చెన్నమనేని కర్ణాకర్ రావు,ఆర్టీవో కార్యాలయంలో ఎం వి ఐ సందాని, కేటీపీపి లో సీఈ శ్రీప్రకాష్, మండల విద్యా వనరుల కేంద్రంలో ఎంఈఓ ఊరుగొండ ఉప్పలయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ కిష్టయ్య, గ్రామపంచాయతీ కార్యాలయాలలో ఆయా పంచాయతీ కార్యదర్శులు, పాఠశాలలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సొసైటీ కార్యాలయంలో చైర్మన్ కన్నేబోయిన కుమార్
యాదవ్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు రేపాక రాజేందర్, బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు మోతె కర్ణాకర్ రెడ్డి,బిజెపి పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు ఊర నవీన్ రావు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిని అనూష, పశువైద్యశాలలో వైద్యాధికారి శ్రీకాంత్ రెడ్డి, ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భాస్కర్ ,ఎస్సై రేఖ అశోక్, పంచాయతీ కార్యదర్శులు ఉమ్మల్ల విజేందర్ ముక్కెర హేమంత్ ,నవీన్, రాకేష్ ,షఫీ నాగమణి,రాజకీయ పార్టీల నాయకులు కొత్త వెంకన్న, పొనగంటి మలహాల్ రావు, కటుకూరి శ్రీనివాస్,మోకిరాల తిరుపతిరావు,లింగంపల్లి వేణు రావు,విడిదినేని అశోక్,చోటే మియా, సూరినేని సంపత్ రావు,లక్కం రాములు,పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి,బైరగాని కుమారస్వామి గౌడ్,మంద మహేష్, అయితు రమేష్, తదితరులు పాల్గొన్నారు.