కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న 375 వ జయంతి ఉత్సవాలు
మంచిర్యాల,నేటి ధాత్రి:
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి ఉత్సవాలను మంచిర్యాల జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మోకు దెబ్బ రాష్ట్ర కార్యదర్శి భూసారపు మొండి గౌడ్ మాట్లాడుతూ..గోల్కొండ కోటపై జెండాను ఎగరవేసిన బహుజన ముద్దుబిడ్డ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు.పోరాటాలతో మొగల్ చక్రవర్తుల వెన్నుల్లో వణుకు పుట్టించిన వీరుడని అభివర్ణించారు.సర్వాయి పాపన్న బడుగు బలహీన పేదల పాలిట ఆపద్బాంధవుడు సమ సమాజ స్థాపన సాధన కోసం ప్రాణాలను పణంగా పెట్టిన వీరుడు.మొగల్ చక్రవర్తులకే ముచ్చేమటలు పట్టించి గోల్కొండ ఖిల్లా పై జెండాను ఎగరవేసిన కొదమ సింహం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు.ఈ కార్యక్రమంలో మోకు దెబ్బ రాష్ట్ర కార్యదర్శి భూసారపు మొండి గౌడ్,జిల్లా అధ్యక్షుడు రాజేశం గౌడ్, జల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాండ్ల భాస్కర్ గౌడ్,రాష్ట్ర నాయకులు తాళ్లపల్లి శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.