హనుమకొండలో నేడు 24 గంటల మెడికల్ షాపుల బంద్!
#దేశవ్యాప్త బంద్‌కు మద్దతుగా హనుమకొండలో స్వచ్ఛందంగా మూతబడనున్న ఔషధ దుకాణాలు
#చిన్న వ్యాపారుల పరిరక్షణకే ఔషధ దుకాణాల బంద్: అసోసియేషన్ ప్రతినిధులు
#హనుమకొండ డ్రగ్ ఇన్స్‌పెక్టర్‌ను కలిసిన కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు
హన్మకొండ, నేటిధాత్రి:
ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్స్ ఇచ్చిన 24 గంటల దేశవ్యాప్త బంద్ పిలుపుకు మద్దతుగా హనుమకొండ జిల్లాలో ఔషధ దుకాణాలు స్వచ్ఛందంగా మూతబడునున్నాయి. హనుమకొండ జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో ఈ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయనున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు హనుమకొండ డ్రగ్ ఇన్స్‌పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ ని కలిసి వినతి పత్రం అందజేశారు. చిన్న కెమిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను, వారికి జరుగుతున్న అన్యాయాన్ని ఈ సందర్భంగా అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. ఆన్‌లైన్ ఫార్మసీల వల్ల మరియు మారుతున్న నిబంధనల వల్ల చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని వారు వివరించారు.
అధికారుల సానుకూల స్పందన
సమస్యలను సావధానంగా విన్న డ్రగ్ ఇన్స్‌పెక్టర్ కిరణ్ కుమార్ సానుకూలంగా స్పందించారు. ఈ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తమ గోడును విని, సానుకూలంగా స్పందించినందుకు జిల్లా కార్యవర్గ సభ్యులు డ్రగ్ ఇన్స్‌పెక్టర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్, తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు.
