కాకతీయ యూనివర్శిటీ మొదటి గేటు వద్ద యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నాయిని రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు

నేటిదాత్రి:

కాకతీయ యూనివర్సిటీ వద్ద యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో వరంగల్ అర్బన్ & రూరల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి జన్మ దిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.
ఈ సందర్బంగా వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు అలువాల కార్తిక్ వరంగల్ వెస్ట్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తోట పవన్ మాట్లాడుతూ ఈ
ఎన్ని సమస్యలు, కష్టాలు చుట్టు ముట్టినా
ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి అనునిత్యం ప్రజల సమస్యలపై పోరాడుతున్న
మన రాజేందర్ రెడ్డి ని కేయూ విద్యార్థులం, యువజన కాంగ్రెస్ మరియు NSUI విద్యార్థి సంఘాలమందరం కలిసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే గా గెలిపించుకుంటామని
మరియు నాయిని అన్నగారు ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపు కోవాలని ఆ భగవంతున్ని కోరుకుంటుంన్నాను.
ఈ కార్యక్రమంలో..డివిజన్ ప్రెసిడెంట్లు సాయిరాం యాదవ్, శ్రీదర్ యాదవ్, వర్ధన్నపేట నియోజకవర్గ వైస్ ప్రెసిడెంట్ వంశి,నెమలి నితిన్ , యూత్ కాంగ్రెస్ నాయకులు అరుణ్, మరియు కాకతీయ యూనివర్శిటీ విద్యార్థులు బన్ని, చరణ్, తరున్ రాజ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే పెద్ది ని పరామర్శించిన నేటిధాత్రి చైర్మన్

తెలంగాణ ఉద్యమకారుడు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తండ్రి స్వర్గీయ పెద్ది రాజిరెడ్డి అనారోగ్యంతో మరణించగా నేటిధాత్రి గ్రూప్స్ చైర్మన్ , సిఈఓ కట్టా రాఘవేంద్ర రావు, నేటిధాత్రి దినపత్రిక మేనేజింగ్ డెరైక్టర్ కట్టా శివ సుబ్రమణ్యం, తెలంగాణ బ్యూరో బిర్రు కుమారస్వామిలు సోమవారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ని నల్లబెల్లి మండల కేంద్రంలోని తన ఇంటి వద్ద పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. రాజిరెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో రూరల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తడుక రమేష్ గౌడ్, నర్సంపేట ఇంఛార్జి కందుల శ్రీనివాస్ గౌడ్,నల్లబెల్లి మండల రిపోర్టర్ పెరుమాండ్ల రాజ్ కుమార్ గౌడ్, నెక్కోండ,చెన్నారావుపేట ఖానాపూర్ మండలాల రిపోర్టర్స్ మధు,యాదగిరి,ప్రవీణ్, వినయ్ గౌడ్ లు పాల్గొన్నారు.

వంద పడకల ఆసుపత్రి  దారిలో నిలిచిన వర్షం నీరు

 

  •  నీరును వెంటనే తొలగించాలి సిపిఎం డిమాండ్

భూపాలపల్లి నేటిధాత్రి:
నిన్న కొంతసేపు కురిసిన వర్షానికి వంద పడకల ఆసుపత్రి కి పోయే దారిలో చెరువులను తలపించేలా నీరు నిలిచిపోవడంతో ఆస్పత్రికి వెళ్లాల్సిన బాలింతలు, గర్భిణీలు వారి బంధువులు ఇబ్బందులు పడుతు వేలవల్సి వస్తుందాని కాబట్టి వెంటనే వర్షం నీరు తొలగించి రోడ్డు నిర్మాణం ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు డిమాండ్ చేశారు.సిపిఎం బృందం వర్షం నీరు నిలిచిన ఉన్న పరిస్థితిని పరిశీలించి అందులో దిగి నిరసన వ్యక్తం చేసి పేషెంట్స్ బంధువులను ఆసుపత్రి కి తరలించడం ఆస్పత్రిలో ఉన్న వారిని బయటికి తరలించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కొద్దిపాటి వర్షానికి నీళ్లు నిలవడం తో పేషెంట్లు హాస్పటల్ మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ లో పనిచేస్తున్న సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం నీరు చెరువులకు పోయే దారిని కాంట్రాక్టర్మూ సివేయడంతో ఈ సమస్య ఉత్పన్నం అయిందని ఆయన పేర్కొన్నారు. వర్షంనిరు చెరువు కు వెళ్లే దారిలో అడ్డుగా కాంట్రాక్టర్ల మట్టిపొయడంతొ నిరు నిలిసిపొయిందాని కావున మట్టిని వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నీరు నిలవడానికి కారణమైన కాంట్రాక్టర్ పై సంబంధిత అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.వర్షం నిరు పై నుండి వస్తున్న వాటర్ పోవడానికి కాలువను ఏర్పాటు చేయాలని అని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఆసుపత్రికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోవడానికి రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆయన కోరారు. ఈ సమస్య పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే రమణారెడ్డి జోక్యం చేసుకోవాలని పరిష్కారించాలని ఆయన అన్నారు. ఇప్పటికైనా ఈ సమస్య పరిష్కారం కాకుంటే రాబోయే రోజులొ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వెలిశెట్టి రాజయ్య, పొలం రాజేందర్, బొట్ల చక్రపాణి ,నాయకులు రజాక్ విరాట్ శ్రీ రాములు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో కోతకు గురవుతున్న సిసి రోడ్డు

  • ఇంత నిర్లక్ష్యం ఎందుకు స్థానిక ప్రజలు

    దామెర,నేటిధాత్రి:

    మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన డబుల్ రోడ్డు సైడ్ డ్రైనేజీ లేక ఇటీవల కురుస్తున్న వర్షాలకు వరద రోడ్డు క్రింది భాగం నుండి వెళుతుండగా క్రింది భాగం మొత్తం కోతకు గురై రోడ్డు కూలిపోయే ప్రమాదముందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా కాంట్రాక్టర్ మేలుకొని సైడ్ డ్రైనేజి ఏర్పాటు చేయాలని ,. సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

రైతు కుటుంబాలకు అండగా కేసీఆర్ ప్రభుత్వం

  •  రూ. కోటి 10 లక్షల విలువైన రైతుబీమా చెక్కుల వితరణ

  •  ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట, నేటిధాత్రి :

దేశానికి అన్నం పెట్టే రైతు ఆకాల మ‌ర‌ణం పొందితే వారిపై ఆధార ప‌డ్డ‌ కుటుంబం రోడ్డున ప‌డుతుందని ,రైతు బ‌తికున్న‌ప్పుడు ఎంత గౌరవంగా బ‌తికారో య‌జ‌మాని చ‌నిపోయాక కూడా అంతే గౌర‌వంగా బ‌త‌కాల‌నే ఉద్దేశ్యంతో రూ.5 ల‌క్ష‌ల‌ ప్ర‌మాద బీమా ను కుటుంబాలకు అందిస్తూ యావ‌త్ ప్ర‌పంచం మెచ్చే విధంగా అలాగే ఐక్య‌రాజ్య‌స‌మితి అభినందించే విధంగా ప‌థ‌కం ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ రైతులకు అండగా ఉన్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. నియోజవర్గంలోని పలు మండలాలలోని 22 మంది రైతులు వివిధ కార‌ణాలతో మృతి చెందగా వారి కుటుంబాలకు ఒక్కొక్క‌రికి టీ 5 ల‌క్ష‌ల చొప్పున రూ. కోటి 10 ల‌క్ష‌ల విలువైన చెక్కుల‌ను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో పంపిణి చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ ఇప్పటివ‌ర‌కు న‌ర్సంపేట నియోజ‌కవ‌ర్గ వ్యాప్తంగా దాదాపు 442 మంది రైతుల‌ కుటుంబాలకు రైతుబీమా పథకం ద్వారా రూ. 22 కోట్ల 10 లక్షలు, అదేవిధంగా 66531 మంది రైతులకు రైతుబందు పథకం ద్వారా 57 కోట్ల 18 లక్షల రూపాయల నగదును అందజేసినట్లు తెలిపారు. రైతుబీమా ప‌థ‌కం వ‌ల‌న యావ‌త్తు తెలంగాణ రైతులు భ‌రోసాగా బ్ర‌తుకుతున్నార ని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పి వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఏడీఏ శ్రీనివాస్ రావు, ఎంపిపిలు, జెడ్పిటిసిలు, అర్ ఎస్ ఎస్ డైరెక్టర్లు, రైతుబందు కమిటీ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపిటిసిలు, సర్పంచ్లు, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

*హూజురాబాద్ టికేట్ నాకే* _యూత్ ఓక్కోకరికి 3000- 5000 ఇస్తా

ఉమ్మడి వరంగల్ జిల్లా బ్యూరో, నేటిధాత్రి

 

 కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కజిన్ బ్రదర్ పాడి కౌశిక్ రెడ్డి ఆడియో కలకలం సృష్టిస్తోంది.

 

టీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందని యూత్‌ను మొబులైజ్ చేయాలని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. ఓ వైపున తాను కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేస్తానని చెప్తూ సీక్రెట్‌గా టీఆర్ఎస్ అభ్యర్థిగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నట్టుగా ఈ ఆడియో ద్వారా స్పష్టం అవుతోంది. హుజురాబాద్ నియోజకవర్గంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పాడి కౌశిక్ రెడ్డి ఆడియో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
కమలాపూర్ మండలం మాదన్న పేటకు చెందిన ఓ యువకునితో మాట్లాడిన సంభాషణలో యూత్‌ను తనకు అనుకూలంగా మొబులైజ్ చేసి, అవసరమైతే ఓక్కోక్కరికి రూ. 3 వేల నుండి రూ. 5 వేల వరకు ఇవ్వాలని కూడా కౌశిక్ రెడ్డి రాజేందర్ అనే వ్యక్తికి సూచించడం గమనార్హం. టీఆర్ఎస్ అభ్యర్థిగా తాను బరిలో నిలుస్తున్నానని కౌశిక్ రేడ్డి చెబుతుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజిరెడ్డితో టచ్‌లో ఉండాలని కూడా కౌశిక్ రెడ్డి సూచించడం సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఆడియో గురించే టీఆర్ఎస్‌తో పాటు అన్ని రాజకీయ పార్టీల్లో చర్చలు జరుగుతున్నాయి.

కేయూ ఇంజనీరింగ్ మూడవ సెమిస్టర్ పరీక్షలు వాయిదా

కేయూ క్యాంపస్, నేటిదాత్రి
కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న మూడవ సంవత్సరం మొదటి సెమిస్టర్ ఇంజనీరింగ్ మిగతా పరీక్షలను నిరవధికంగా వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య పి మల్లా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 9, 12, 14, 16 వ తేదీల్లో జరగాల్సిన మిగతా ఇంజనీరింగ్ పరీక్షలను వాయిదా వేసినట్లు వారు పేర్కొన్నారు. పరీక్షలు మళ్ళీ ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని, షెడ్యూల్ను వెబ్సైట్లో ఉంచుతామని తెలిపారు. హాస్టల్లో ఉండే వసతి తీసుకుంటున్న విద్యార్థులలో కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య అధికారుల నేతృత్వంలో అధికారులు పరీక్షలు నిర్వహించారు. విద్యార్థుల అభ్యర్థన మేరకు సోమవారం నుంచి జరగాల్సిన మిగతా పరీక్షలు సైతం వాయిదా వేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version