17 ఏళ్ల రాహుల్-విజయ్ ఫ్రెండ్షిప్…

17 ఏళ్ల రాహుల్-విజయ్ ఫ్రెండ్షిప్

సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అందరి దృష్టిని ఆకర్షించిన అంశం… రాహుల్ గాంధీ-విజయ్ మధ్య కనిపించిన సాన్నిహిత్యం. వేదికపై పక్కపక్కనే కూర్చొని… కలిసి ప్రజలకు అభివాదం చేయడం ప్రత్యేకంగా నిలిచింది.

అయితే వీరిద్దరి పరిచయం ఇప్పటిదికాదు. 2009లో విజయ్ తన తండ్రి చంద్రశేఖర్‌తో కలిసి రాహుల్ గాంధీని కలిశారు. అప్పట్లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా… యువజన కాంగ్రెస్ బాధ్యతలు చూస్తున్న రాహుల్‌తో విజయ్‌కు మంచి అనుబంధం ఏర్పడింది.

ఆ సమయంలో విజయ్‌కు తమిళనాడు యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవిని కూడా ఆఫర్ చేశారు. అయితే విజయ్ కాంగ్రెస్‌లో చేరలేదు. కానీ అప్పటినుంచే రాహుల్-విజయ్ మధ్య వ్యక్తిగత బాండింగ్ కొనసాగింది.

17 ఏళ్ల తర్వాత ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విజయ్ టీవీకే పార్టీని స్థాపించి తొలి ప్రయత్నంలోనే అధికారంలోకి వచ్చారు. ఆయన విజయానంతరం రాహుల్ గాంధీతో పలుమార్లు ఫోన్‌లో మాట్లాడారు.
ఇక ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తూ విజయ్… రాహుల్‌ను “సోదరా” అని సంబోధించడం ప్రత్యేకంగా మారింది. ఆ పిలుపుకు స్పందించిన రాహుల్… కార్యక్రమానికి హాజరై విజయ్ వెంటే కనిపించారు.

ఇంతకాలం డీఎంకేతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్.. ఆ పార్టీతో కలిసే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. కేవలం ఐదు స్థానాలను మాత్రమే గెల్చుకుంది. రాష్ట్రంలో ఆ పార్టీ ప్రాధాన్యం రోజురోజుకూ తగ్గిపోతున్న సమయంలో ఈ ఎన్నికల అనంతరం పొత్తు కుదిరింది.

తన భావజాలానికి దక్షిణభారతంలో విజయ్ తగిన మిత్రుడని రాహుల్ భావిస్తున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. అలాగే, ఎన్నికల ప్రచారంలో భాగంగా డీఎంకే నిర్వహించిన పలు సమావేశాలకు రాహుల్‌ హాజరుకాలేదు. ఇవన్నీ కూడా వారి మధ్య స్నేహం బీటలు వారిందనడానికి ఓ ఉదాహరణగా కనిపిస్తున్నాయి. విజయ్ గెలిచిన దగ్గరి నుంచి రాహుల్ ఇప్పటివరకు మూడుసార్లు ఫోన్ చేశారట. ఇక ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తూ విజయ్ ఆయన్ను సోదరా అని సంబోధించారు. రావడానికి ప్రయత్నిస్తానని బదులిచ్చిన రాహుల్.. ఈ రోజు విజయ్ వెంటే కనిపించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version