ప్రజావాణికి 142 దరఖాస్తుల రాక
అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
సిరిసిల్ల(నేటి ధాత్రి):
జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించగా, 142 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటిని పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.
రెవెన్యూ శాఖకు 56, డీఆర్డీఓకు – 20, జిల్లా పంచాయతీ కార్యాలయం 14, గృహ నిర్మాణ శాఖకు 13, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ 7, నీటి పారుదల శాఖ, మున్సిపల్ కమిషనర్ కు మూడు చొప్పున, జిల్లా పౌర సరఫరాల శాఖ, జిల్లా విద్యాధికారి, ఉపాధి కల్పన అధికారి, జిల్లా వైద్యాధికారి, మైనింగ్ శాఖ అధికారి, ఎక్సైజ్ అధికారి, సెస్ ఎండీకి రెండు చొప్పున, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, ముఖ్య ప్రణాళిక అధికారి, జిల్లా వ్యవసాయ శాఖ, అటవీ శాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ, జిల్లా సంక్షేమ శాఖ, వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర ఆలయం, ఈఈ ఆర్ అండ్ బీ, లీడ్ బ్యాంక్ మేనేజర్, మున్సిపల్ కమిషనర్ వేములవాడ, సబ్ రిజిస్టర్ ఆఫ్ సిరిసిల్ల, ఎస్పీ కార్యాలయం కు ఒకటి చొప్పున వచ్చాయి. వాటిని సంబంధిత కార్యాలయాలకు పంపించారు.
ప్రజావాణిలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, హౌసింగ్ పీడీ వెంకట మాధవ రావు ఆయా శాఖల తదితరులు పాల్గొన్నారు.
