పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలీ..

పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలీ

సిపిఐ పట్టణ కార్యదర్శి
సోతుకు ప్రవీణ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపుమేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద సిపిఐ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ముందుగా కొమురయ్య భవన్ నుండి అంబేద్కర్ కూడలి వరకు ఎర్రజెండాలతో ర్యాలీ తీశారు. అనంతరం సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఇస్లామిక్ దేశమైన ఇరాన్ పై అమెరికా యుద్ధం చేస్తుంది ఆ కారణంతో క్రూడ్ ఆయిల్ ధరలు కొరత ఉందని గ్యాస్ ధరలు పెంచడం మోదీ ప్రభుత్వానికి అంత మంచిది కాదని ఆయన మండిపడ్డారు. ఇరాన్ భారత మిత్ర దేశమని భారత్ కుఎప్పుడు సహకరిస్తూ వస్తున్న ఇరాన్ ను వదిలేసి అగ్రరాజ్యమైన అమెరికా సంకనికి కూర్చోవడం భారత ప్రధాని మోడీకిసరైనది కాదు ఆయన ఈతవు పలికారు. నరేంద్ర మోడీ వైపల్య కారణంగానే గ్యాస్ సిలిండర్ల సరఫరా కొరత ఏర్పడుతుందన్నారు.
అమెరికా దేశ అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ మాటలు వింటే భారతదేశానికి అపారమైన నష్టం వాటిలుతుంది అదిభవిష్యత్తులో భారతదేశానికి ముప్పు తలపెట్టి అవకాశం ఉందని దాన్ని మోది ప్రభుత్వం పసిగట్టి మసులుకుంటే మంచిదని తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గోదావరి ఒడ్డున గ్యాస్ నిక్షేపాలను ఆదానికి కట్టబెట్టి పైప్ లైన్ల ద్వారా గుజరాత్ రాష్ట్రానికి తరలించకపోతుంన్నారు అని ఆయన ఆరోపించారు. ఇప్పటికే పెరిగే ధరలని
నియంత్రించలేని మోడీ గ్యాస్ ధరలు పెంచి ములిగేనకపై తాటికాయ పడ్డట్టుగా ప్రజలపై పారాలు మోపడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. వెంటనే పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని అమెరికా ఇజ్రాయిల్ ఉచ్చులో చిక్కుకోవద్దని భారత దేశ సారా బహుమత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం పై ఉందని ఆ దిశగా పయనించాలని లేని యెడల యావత్ భారతదేశం ఉన్న 140 కోట్ల మంది జనాభా ముందు బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం దోషిగా నిలబడాల్సి వస్తుందని ఆయన తెలియజేశారు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు అధికారం ఉంది మేము ఏమైనా చేస్తామని మోడీ ప్రభుత్వం ఆలోచన చేస్తే బిజెపి పట్టావో అని దేశ ప్రజలు మొత్తం బిజెపి ప్రభుత్వంపై తిరగబడక తప్పదని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు వేముల శ్రీకాంత్, నేరెళ్ల జోసెఫ్, యాకుబ్ పాషా, గోలి లావణ్య,ఎండి సాబీర్,పొనగంటి లావణ్య, పోతుగంటి స్వప్న, శ్రావణి, పెద్దమాముల సంధ్య, పద్మ,గంప రాజు, రమేష్ చారి,పాండవుల రాజేశ్వరి,తదితరులు సిపిఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version