* భావితరాలకు ఆదర్శప్రాయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జై భీమ్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి ఉత్సవం.*
మొగులపల్లి నేటి దాత్రి
భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం లోని గ్రామంఆకినపల్లి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీతికి వెలిసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ స్థాపన జరిగి ముచ్చటగా మూడు వసంతాలు కావస్తున్న సందర్భాన్ని గుర్తుచేస్తూ అదేవిధంగా భారతరత్న భరతమాత ముద్దుబిడ్డ ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పుష్పాభిషేకం గజమాలతో సత్కరించి అంబేద్కర్ స్టాచ్యూపై మొట్టమొదటిసారిగా పంచశీల పతాకాన్ని డాక్టర్ దూడపాక రమేష్ ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి ఆట పాట మాట కార్యక్రమాలను ప్రారంభించారు.. కార్యక్రమంలో వేదికపై పలువురు అంబేద్కర్ గూర్చి తన జీవితాన్ని సమాజంలో జరుగుతున్నటువంటి పోకడలను గూర్చి మాట్లాడడం జరిగింది..
జై భీమ్ అధ్యక్షులు మాట్లాడుతూ…
అంబేద్కర్ అంటే ఒక వ్యక్తి కాదు ఒక జ్ఞాన ఖడ్గం..అంబేద్కర్ అంటే..
ఒక విప్లవం,
ఒక చైతన్యం,
ఒక మార్గం,
ఒక సిద్ధాంతం,
ఒక జ్ఞానం,
సమసమాన సమానత్వం
ఇది అర్థం చేసుకోలేని సమాజం *ఒక ఒక జాతికో,మతానికో,ఒక కులానికో ప్రాంతానికో ఆపాదించి చేతులు దులుపుకోవడం అతి సాధారణం అయిపోయింది..!భారతదేశం అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఈ అంతర్గత దాగుడుమూతలే కారణ సూచి..!!
కానీ ఇకనైనా ప్రతిఒక్క చదుకున్న జ్ఞానవంతులు నిజానిజాలు తెలుసుకొని సమాజహితం కోసం పాటుపడాలని కోరారు..
ఈ కార్యక్రమంలో జై భీమ్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ దూడపాక రమేష్ ఉపాధ్యక్షులు దూడపాక సమ్మయ్య (కాంగ్రెస్) ప్రధాన కార్యదర్శి దూడపాక రాజు కోశాధికారి గడ్డం రమేష్ ముఖ్యాసలహధారు పోతార సంతోష్ దూడపాక ప్రభాకర్ సరిగొమ్ముల సదానందం,సరిగొమ్మూల నారాయణ.. గడ్డం సూర్య ప్రకాష్, దూడపాక జలంధర్, ముషం అజయ్ (ఆర్.ఎం.పి) ,దూడం రాజు (ఆర్.ఎం.పి) రొంటాల రాజేందర్, దూడ పాక రామస్వామి,గడ్డం శ్రీకాంత్, సప్పిడి రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.
