రెచ్చగొట్టకు రేవంత్‌!

`బెదిరింపులు మానుకో!!

`నేటిధాత్రి ఇలాంటి ఉడుత ఊపులు చాలా చూసింది?

`నీ రాజకీయం పుట్టకముందే నేటిధాత్రిది అక్షర ప్రభంజనం.

`నువ్వు రాజకీయ ఓనమాలు నేర్వకముందే, ఉమ్మడి రాష్ట్ర పాలకులకు నిద్ర లేకుండా చేసింది.

`పందొమ్మిదేళ్లుగా ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నది.

`సమైక్య పాలకులనే ఎదిరించి నిలిచింది.

`తెలంగాణ ఉద్యమాన్ని తన భుజాల మీద మోసింది.

`నేటిధాత్రి రాజకీయ ప్రత్యర్థి కాదు! ప్రశ్నా ప్రపంచం.

`సామాజిక బాధ్యతకు నిదర్శనం.

`పత్రికల మీద దాడులు ప్రజాస్వామ్య పరిహాసం.

` ప్రత్రికలలో వచ్చిన వార్తలను ఖండిరచే అవకాశం వుంది.

`స్వార్థ రాజకీయాల కోసం అనవసరంగా యువకుల జీవితాలను బలిచేయొద్దు?

`నేటిధాత్రి కి బెదిరింపు కాల్స్‌ చేసిన వారిపై కేసులు నమోదు చేయడం నిమిషం పని. 

`వాళ్ల జీవితాలు ఆగం కావొద్దనే ఊరుకుంటున్నాము.

`మళ్ళీ ఎలాంటి కాల్స్‌ వచ్చినా చట్ట పరంగా చర్యలు తీసుకుంటాం.

`నాయకుడిగా క్రెడిబిలిటీ నిలబెట్టుకుంటావో, క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటావో ఆలోచించుకో!

`పత్రికలో వార్తలే జీర్ణించుకోకపోతే, ప్రజల ప్రశ్నలు ఎలా వింటావు?

`రాజకీయ అవకాశ వాదులను నేటిధాత్రి ఉపేక్షించదు.

`శివుడు గొంతులో గరళమంత శక్తి కల్గినది నేటిధాత్రి.

హైదరబాద్‌,నేటిధాత్రి:                                     

నేటిధాత్రి తన 19 సంవత్సరాల సుధీర్ఘ అక్షర ప్రయాణంలో అనేక మంది నాయకులను చూసింది. కొత్తగా రేవంత్‌ వర్గంచూపించే ఉడుత ఊపులకు నేటిధాత్రి భయపడుతుందనుకుంటే అది భ్రమే అవుతుంది. నాయకులపై వార్తలు వస్తే వాటిని ఖండిరచే అవకాశం వుంది. ప్రభుత్వాలను విమర్శించే హక్కు ప్రతిపక్షాలకు వుందని చెప్పుకునే రేవంత్‌ రెడ్డికి, తన రాజకీయాన్ని కూడా పత్రికలు ప్రశ్నిస్తాయన్న సోయి లేకపోవడం విడ్డూరం. నాయకుడిగా తాను ఇష్టం వచ్చినట్లు ఇతర పార్టీలను, ఇతర నాయకులను నోటికి ఎంత వస్తే అంత మాట్లాడే రేవంత్‌కు నేటిధాత్రి మీద మాట్లాడే అర్హత లేదు. ఇదిలా వుంటే యువకులను అడ్డంపెట్టుకొని శిఖండి రాజకీయాలు చేయడం ఏమిటి? ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీలో నాయకుల పట్ల ఇలాంటి వ్యవహారాలు జరిగితే, జగ్గారెడ్డి లాంటి నాయకులు కూడా రేవంత్‌ని నేరుగానే విమర్శించారు. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు వి. హనుమంతరావును సైతం రేవంత్‌ సైన్యం పేరుతో గతంలో బెదిరింపులకు పాల్పడ్డారు. ఇదేం పద్దతి అని వాళ్లు ప్రశ్నిస్తే నాకు సంబంధం లేదని చేతులు దులుపుకున్నావు. నాయకులకు క్షమాపణ చెప్పుకున్నావు. ఇప్పుడు రేవంత్‌కు వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయన్న భ్రమలో నేటిధాత్రిని బెదిరిస్తున్నావా? ఆవేశపరులైన యువకుల జీవితాలను స్వార్ధ రాజకీయాలకు కోసం వాడుకొని, వారి భవిష్యత్తును నాశనం చేయకు. గత కొన్ని రోజులుగా రేవంత్‌ సైన్యం పేరుతో ఫోన్లు చేస్తున్నారు. వారిని పోలీసులకు పట్టించడం నిమిషం పని. కాని రాజకీయ నాయకుల లాగా మీడియాకు స్వార్ధ ప్రయోజనాలుండవు. నాయకుడు వ్యక్తి. అందకే వారికి వ్యక్తిగత అసవరాలు, రాజకీయ క్రీడలు, పదవుల పందేరాలుంటాయి. మీడియాకు సమాజ శ్రేయస్సు మాత్రమే వుంటుంది. అందుకే బెదిరింపులకు పాల్పడిన వారిని చూస్తే జాలేస్తుందే? కాని కోపం రావడం లేదు. ఎందుకంటే వారి జీవితాలేమిటో వారికే తెలియదు. వారి భవిష్యత్తు నాయకులకు తాకట్టు పెడతారు? అలాంటి వారి జీవితాలు నాయకుల కబంధ హస్తాలనుంచి బైట పడాలనే మీడియా కోరుకుంటుంది. నేటిధాత్రి కూడా అదే ఆలోచిస్తుంది. అందుకే రేవంత్‌ సైన్యం పేరుతో వస్తున్న బెదింపులను పట్టించుకోలేదు. కాకపోతే అవి మరీ శృతి మించితే ఊరుకునే ప్రసక్తి లేదు. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి ఇలాంటి దిగజారుడు చేష్టలు మానుకుంటే చాల మంచింది. రాజకీయాలన్నాక పూలు, పడతాయి? రాళ్లు పడతాయి? అవి రేవంత్‌కు తెలియంది కాదు. 

పద్నాలుగేళ్లపాటు సుదీర్ఘ పోరాటం సాగించి సాధించుకున్న తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని అస్ధిరపర్చాలని, తెలంగాణను ఆగం చేయాలని చూసిన రేవంత్‌రెడ్డిని దిగజారుడు రాజకీయాలు తప్ప మంచి రాజకీయాలు ఆశించడం కూడా అత్యాశే అవుతుంది.

 వెనకటి గుణమేలా మాను..వినరా సుమతీ! అన్నట్లు ప్రజలు ఎన్నుకొని, ప్రజా ప్రతినిధిని చేస్తే కూడా తన వ్యవహార శైలిని మార్చుకోకపోతే నాయకుడిగా ఎంత ఎదిగినా వృధానే! ఈ విషయం రేవంత్‌రెడ్డి ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. ఇప్పటికే ఎంతో ఆలస్యమైంది. హుందాపూరిత రాజకీయాలు నెరపాలి. అంతేకాని వ్యక్తి స్వామ్యరాజకీయాలు ప్రజాస్వామ్యంలో రాణించవు. రేవంత్‌రెడ్డి రాజకీయాలు మొదలుపెట్టక ముందు నుంచే నేటిధాత్రి అక్షర ప్రభంజనం కొనసాగుతోంది. అది ముందు తెలుసుకుంటే ఎంతో మంచింది. తెలంగాణ ఉద్యమం కోసమే పుట్టిన పత్రిక, తెలంగాణ మానస పుత్రిక నేటిధాత్రి. కేవలం తెలంగాణ కోసం వ్యాపారాలు మానుకొని, భూములను అమ్ముకొని నేటిధాత్రి అక్షరోద్యమం చేసింది. అంతటి త్యాగం నేటిధాత్రికి వుంది. కాని రేవంత్‌ అనే నాయకుడికి చెప్పుకోవడానికి రాజకీయం తప్ప, తెలంగాణ ఉద్యమ నేపధ్యంలేదు. తెలంగాణ కోసం కొట్లాడిరది అసలే లేదు. పైగా ఎక్కడ తెలంగాణ వాదులు తన పర్యటనను అడ్డుకుంటారో? అని ఆ రోజుల్లో కరీంనగర్‌లో జరిగిన తెలుగుదేశం పార్టీ సమావేశాలకు గన్‌ పట్టుకొని మరీ వెళ్లిన సంగతి ప్రజలు మర్చిపోలేదు. తెలంగాణ ఉద్యమ ద్రోహంలో ప్రదాన పాత్రదారులకు, సూత్రదారులకు అండగా వున్న రేవంత్‌చరిత్ర అందరకీ తెలుసు. అయినా ఇప్పుడు సత్యవంతుడినన్నట్లు, తెలంగాణ కోసం కల్లబొల్లి మాటలు చెబితే ఎవరూ నమ్మురు? నిజంగా తెలంగాణ ప్రజల మీద ప్రేముంటే, వాళ్లు నమ్మితే ఎవరూ అడ్డుకునే పరిస్ధితి వుండదు. నేటిధాత్రిని ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు కొన్ని వందల సార్లు మభ్యపెట్టాలని చూశారు. మాయ చేయాలని చూశారు. ఇబ్బందులకు గురిచేశారు. నేటిధాత్రి నడవకుండా అనేక కుట్రలకు తెరతీశారు. ఆర్ధిక మూలాలు దెబ్బతీయాలని చూశారు. కాని నాటి పాలకులు కుయుక్తులన్నింటికీ ఎదిరించి ఉద్యమంలో తెలంగాణ అక్షర వేదాలు రచించింది. తెలంగాణ ఉద్యమ యజ్ఞం సాగించింది. తెలంగాణలోని ప్రతి మారుమూల పల్లె గొంతును వినిపించింది. ఆకుల అలజడిలో కూడా తెలంగాణ శబ్ధం వినిపిచింది. ఎండిన గొంతును నుంచి తెలంగాణ రాగం ఆలపించేలా చేసింది. అదీ నేటిధాత్రి ఘనత. చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా వుంది. చెప్పుకుంటుంటే ఇప్పటికీ ఉద్వేగం ఉప్పొంగుతుంది. మరి రేవంత్‌ నువ్వెం చెప్పుకుంటావు? తెలంగాణను అడ్డుకునే ప్రయత్నం చేసి విఫలమయ్యావని చెప్పుకోవాలి? తెలంగాణకు నేటిధాత్రి చేసిన అక్షర సేవ ముందు రేవంత్‌ రాజకీయాలు ఒక దూళి కణంతో సమానం. ఇప్పటికైనా నేటిధాత్రి మీద బెదిరింపులు మానుకో…ఎందుకంటే ఇలాంటి అదిరింపులు అనేకం చూశాం..ఎదుర్కొన్నాం…నిలబడ్దాం…అంతేకాదు తప్పు చేస్తే అధికారంలో వున్న నాయకులను, పదవుల్లో వున్న మంత్రులను కూడా నిలదీసి, కడిగేసిన చరిత్ర నేటిధాత్రిది..ముందు నేటిధాత్రి చరిత్ర తెలుసుకో..దాని విశ్వరూపం ఎంత గొప్పదో చూసుకో…! తప్పు చేస్తే ఎంతటి వారినైనా నిప్పుకణికల్లాంటి అక్షరాలతో కడిగేస్తాం..? ప్రభుత్వంలో వుండి తప్పులు చేసిన వారినే వదల్లేదు. వారి ప్రలోభాలకు లొంగలేదు. బెదిరింపులకు అదరలేదు. నేటిధాత్రికి వున్న బలమే అక్షర సైన్యం. అవి కవాతు మొదలుపెడితే ఎంతటి వారికైనా చుక్కలు కనిపించాల్సిందే…

 అసలు నేటిధాత్రి చెప్పిన వార్తలకు, రేవంత్‌ రెడ్డి సైన్యం బెదిరింపులకు ఏమైనా సంబంధం వుండాలా? వద్దా?

 అసలు రేవంత్‌రెడ్డి లేకపోతే కాంగ్రెస్‌ నడవదని అనుకుంటుంటే, రేవంత్‌ వుంటేనే కాంగ్రెస్‌ నడవదని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అనుకుంటున్నారు? ఇది భహిరంగ రహస్యమే! అదే నేటిధాత్రి చెప్పింది. ఇది వాస్తవం కాదా? దాన్ని జీర్ణించుకోలేకపోతే..అది నిజం కాదని నిరూపించాలనుకుంటే కాంగ్రెస్‌ పార్టీ పెద్దలందరి చేత జేజేలు కొట్టించుకో! అది సాధ్యమయ్యే పని కాదు? కాని నేటిధాత్రిని బెదింపులకు గురిచేస్తారా? నాయకుడన్న తర్వాత ఓర్పు సహనం వుండాలి. అయినా మీడియా అంటేనే లోపాలను ఎత్తిచూపేది. పార్టీ పరంగా వున్న అవరోధాలు, నాయకత్వాలలో వున్న లోపాలు, యంత్రాంగంలో హెచ్చుతగ్గులు ఇలా ప్రతి విషయాన్ని మీడియా సృషిస్తుంది. పార్టీలకు సూచనలు చేస్తుంది. వాటిని విమర్శలు అనుకోవడంలోనే పార్టీల అసలు స్వరూపం బైటపడుతుంది. నాయకుల డొల్లతనం కళ్లకు కనిపిస్తుంది. అయినా మీడియా ఇదే రాయాలి? ఇదే చెప్పాలి? తమ నేత గురించే గొప్పగా చెప్పాలి? లేకుంటే ఆ మీడియాపై పడిపోతాం? యాగీ చేస్తాం? దాడులు చేస్తాం? అంటూ వార్నింగ్‌లు ఇవ్వడం ఏమిటి? ఏ కాలంలో బతుకుతున్నాం. ఇప్పుడున్నది రాజరికంకాదు. రాజల కాలంలో కూడా ప్రజలు సమస్యలు తెలుసుకునేందుకు, పాలన పట్ల ప్రజలు అభిప్రాయాలు తెలుసుకునేందుకు రాత్రి వేళలలో మారు వేషంలో తిరిగే వారట. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారో..ప్రజల్లో నేతల మీద వున్న అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఇప్పుడున్న పరిస్ధితుల్లో నాయకులకు పెద్ద శ్రమ అవసరం లేదు. మీడియా వుంది. ఆ మీడియానే సమాజ చైతన్యానికి గీటు రాయి. ఒక రకంగా సమాజానికి దిక్సూచీ. అది అర్ధం చేసుకోకపోతే నాయకులకు మనుగడ లేదు. భవిష్యత్తు అంత కన్నావుండదు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!