ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 373 వ జయంతి వేడుకలు
వీణవంక( కరీంనగర్ జిల్లా):
నేటి ధాత్రి:వీణవంక మండల కేంద్రం తో పాటు అన్ని గ్రామాలలో గౌడ సంఘం అధ్యక్షులు , గీత కార్మికులు మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో వీణవంక మండల సర్వాయి పాపన్న గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు దొమ్మటి రాజమల్లు గౌడ్ ఆధ్వర్యంలో మన బహుజన వీరుడు సర్థార్ సర్వాయి పాపన్న గౌడ్ 373 వ జయంతి వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకోవడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ..జనగామ జిల్లా లోని రఘునాథ్ పల్లి మండలం లోని ఖిలాశపూర్ గ్రామంలో సర్వమ్మ -ధర్మన్న ల ఏకైక సంతానం 1650 సంవత్సరం లో జన్మిచినాడు. గౌడ జాతి లో పుట్టి గోల్కొండ కోటను ఏలిన రాజు అయినందుకు గౌడ జాతి గర్వపడాలి అని 17 వ శతాబ్దంలోనే బహుజనులకు రాజ్యాధికారం తెచ్చిన బహుజన వీరుడు సర్వాయి పాపన్న అని కొనియాడారు. కార్యక్రమంలో నల్లగొని రమేష్, బొంగోని రాజయ్య, నరేష్ గౌడ్, దూలం సమ్మయ్య గౌడ్, పైడిమల్ల శ్రీనివాస్, నల్లగొని కొండల్, బొంగోని రాయమల్లు, బాలసాని సంపత్, పాపగౌడ్ , రాజు సదానందం, కొండల్ పెరుమాండ్ల రాజేందర్ గీత కార్మికులు పాల్గొన్నారు.