నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట పట్టణంలోని జయలక్ష్మి సెంటర్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బత్తిని రాజేందర్ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ తక్కల్లపెళ్ళి రవీందర్ రావు, మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్, బీసీ సెల్ చైర్మన్ ఓర్సు తిరుపతి లు మాట్లాడుతూ 16వ శతాబ్దంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేసి, బహుజన రాజ్య స్థాపన చేసిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు. బహుజన రాజ్య స్థాపనకు బహుజనులు అంతా ఏకమై, దళిత బహుజన అణిచివేతకు విముక్తి కల్పించాలని, దళిత బహుజనులకు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే ఆత్మగౌరవం దక్కుతుందని అభివృద్ధి జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఎలకంటి విజయకుమార్, ముల్కల సాంబయ్య, గాజుల రమేష్, సోల్తి సాంబయ్య గౌడ్, బాణాల శ్రీనివాస్, దండెం రతన్ కుమార్, ఓర్సు సాంబయ్య, నాంపల్లి వెంకటేశ్వర్లు, రామగోని శ్రీనివాస్, ఎండి బాబా,
గిరిగాని రమేష్ ఇస్లావత్ పద్మా బాయ్ , ఆడెపు రమాదేవి, నూనె పద్మ, దేశీ సాయి పటేల్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.