కేసిఆర్‌ వ్యూహం పన్నితే పద్మవ్యూహమే!

https://epaper.netidhatri.com/

ఇంతింతై వటుడిరతై అన్నట్లు బిఆర్‌ఎస్‌ ప్రస్తానం పెంచుతూ, దేశంలోనే బలమైన నేతగా కేసిఆర్‌ ఎదుగుతూ వస్తున్నారు. దేశ రాజకీయాల్లో క్రియాశీల శక్తిగా మారారు. అంటున్న రైతు విమోచన కమీషన్‌ చైర్మన్‌ నాగుర్ల వెంకన్న నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో కేసిఆర్‌ రాజకీయ వ్యూహాలను, ఆసక్తికరమైన అంశాలను వివరించారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే…

https://epaper.netidhatri.com/

`కేసిఆర్‌ రాజకీయంలో ప్రతిపక్షాలు విలవిల?

`నాయకులు గిలగిల!

`తెలంగాణ విశ్వాసమే కేసిఆర్‌!

`కేసిఆర్‌ పై వున్న నమ్మకం చెరిపేయడం అసాధ్యం

`కారుతో పోటీ పడడం కష్టమే!?

`చోటు కోసం వెతుకులాట!

`తెలంగాణలో ఉనికి లేని ప్రతిపక్షాలు!

`మూడు నెలల ముందే గులాబీ గుభాలింపు.

`అభ్యర్థుల ప్రకటనతో సందడే సందడి!

`ప్రతిపక్షాలు జల్లెడ పట్టినా అభ్యర్థులు కరువు?

`కాంగ్రెస్‌ కు కనుచూపు మేరలో కూడా కనిపించని భవిష్యత్తు!

`ఎవరొస్తారా…కండువా కప్పుదామని ఎదురుచూపు!

`దరఖాస్తు చేసుకొమ్మన్మా దొరకడం లేదు?

`బిజేపి అసలు దరిదాపుల్లోనే లేదు.

`మీడియాలో హడావుడి తప్ప బిజేపి వున్నట్లే లేదు.

`పాతిక సీట్లలో కూడా డిపాజిట్లు రాకపోవచ్చు.

`అన్ని సీట్లలో అభ్యర్థులే దొరక్కపోవచ్చు?

` ఉనికి కోసం తండ్లాట తప్ప, పోటీ అన్నది ఉత్తముచ్చటే!

హైదరబాద్‌,నేటిధాత్రి:       

 https://epaper.netidhatri.com/                  

రాజకీయ వ్యూహాలను పన్నడంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ను మించిన నాయకుడు లేడు. ఇప్పుడే కాదు, తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిన నాటి నుంచి అనుసరిస్తున్న రాజకీయ ఎత్తుగడలు ఎవరికీ అంతుచిక్కకుండానే చేస్తున్నారు. ఆనాటి నుంచి ఎప్పటికప్పుడు కేసిఆర్‌ రాజకీయాన్ని ఎదుర్కొనేందుకు నాటి కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు అనేక అవస్ధలు పడేవి. తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిన సమయంలోనే వచ్చిన ఎన్నికల్లోనే కేసిఆర్‌ తన రాజకీయ వ్యూహ చతురతను ప్రదర్శించి నాడు తెలుగుదేశం పార్టీకి షాక్‌ ఇచ్చారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జత కట్టి ఆపార్టీ తెలంగాణ ఇవ్వాల్సిన అవసరాన్ని సృష్టించారు. రాజకీయ చదరంగంలో కాంగ్రెస్‌ను ఇరికించేశారు. ప్రజా ఉద్యమాలను మిలితం చేసి, రాజకీయాలను ఒడిసి పట్టుకున్నాడు. అడుగడుగునా తెలంగాణ విజయాలు ప్రపంచానికి చూపిస్తూ వచ్చారు. అందులో భాగంగానే 2014 ఎన్నికల్లో అనూహ్యమైన విజయాన్ని బిఆర్‌ఎస్‌కు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్‌ది. ఆ తర్వాత ముందస్తుకు వెళ్లి కూడా విజయం సాధించడం అంటే ఆషామాషీ కాదు. గతంలో ఎన్నడూ చరిత్రలో ముందస్తుకు వెళ్లిన పార్టీ గెలిచిన సందర్భంలేదు. మొదటిసారి కేసిఆర్‌ చేసిన ప్రయత్నం విజయవంతమైంది. ఇప్పుడు దేశంలో ముందస్తు కూడా ఒక ఆనవాయితీగా మారేందుకు దోహదమైంది. గతంలోనూ ఇంతే..ఎన్నికలను అవలోకగా ఎదుర్కొవడంలో కేసిఆర్‌ దిట్ట. ఎన్నికల ప్రక్రియ అంటేనే ఓ రాజకీయ క్రీడ. దానిలో ఓడినవారు మళ్లీ గెలవడం, గెలిచిన వాళ్లు ఓడడం అన్నది ఆనవాయితీ. కాని కేసిఆర్‌కు మాత్రం ఏనాడు ఓటమి లేదు. వ్యక్తిగతంగానైనా ఆయన ఓడిరది లేదు. పార్టీకి అపజయం అన్నది లేదు. 2004 ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌ సంప్రదాయానికి విరుద్దంగా వ్యవహరించింది. అనూహ్యంగా బిఆర్‌ఎస్‌ పొత్తుతో గెలిచిన కాంగ్రెస్‌ బిఆర్‌ఎస్‌ను మింగేయాలని చూసింది. కాని కేసిఆర్‌ ఎంతో చాకచక్యంగా పార్టీని కాపాడడమే కాదు, తెలంగాణ జనాన్ని కదిలించారు. ప్రజలే బిఆర్‌ఎస్‌ను కాపడుకునేలా చేశారు. ప్రజలంతా జై తెలంగాణ అనేలా చేసి, బిఆర్‌ఎస్‌ను రాజకీయంగా ఎవరూ ఎదుర్కొలేరన్నంత బలంగా తయీరు చేశారు. ఇదీ కేసిఆర్‌ చాణక్యం..అదే ఒరవడి కొనసాగిస్తూ ఒకనాడు ఉప ప్రాంతీయ పార్టీగా మొదలై, నేడు జాతీయ స్ధాయికి చేరింది. ఇంతింతై వటుడిరతై అన్నట్లు బిఆర్‌ఎస్‌ ప్రస్తానం పెంచుతూ, దేశంలోనే బలమైన నేతగా కేసిఆర్‌ ఎదుగుతూ వస్తున్నారు. దేశ రాజకీయాల్లో క్రియాశీల శక్తిగా మారారు. అంటున్న రైతు విమోచన కమీషన్‌ చైర్మన్‌ నాగుర్ల వెంకన్న నేటి ధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో కేసిఆర్‌ రాజకీయ వ్యూహాలను, ఆసక్తికరమైన అంశాలను వివరించారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే…

ముచ్చటగా మూడోసారి తెలంగాణలో బిఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం.

 అసలు ప్రతిపక్షాలు తమ రాజకీయాలు తాము చేసుకోవడం మర్చిపోయాయి. బిఆర్‌ఎస్‌ పార్టీ అడుగులేమిటో…ముఖ్యమంత్రికేసిఆర్‌ ఏం చేస్తాడో అన్న ఆసిక్తిని పెంచుకొని, ఎన్నికల ముందే తమ అశక్తను వ్యక్తం చేస్తున్నాయంటే అతిశయోక్తికాదు. రెండుసార్లు వరస ఓటమి చెందిన కాంగ్రెస్‌ పార్టీకి మూడోసారి కోలుకోలేని దెబ్బ పడనుంది. గతం కన్నా బిఆర్‌ఎస్‌ ఇప్పుడు మరింత బలంగా మారింది. పెద్దఎత్తునయువత కూడా బిఆర్‌ఎస్‌ పార్టీ వైపు ఆకర్షితులౌతున్నారు. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా సరే ప్రజలకు ఉపాధి కల్పనా వసతులు అందుబాటులోకి తెస్తే ఆ సమాజం వేగంగా అభివృద్ది చెందుతుంది. ఇదే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్‌ చేసి చూపెట్టాడు. గతంలో తెలంగాణలో ఉపాది అవకాశాలులేవు. కనీసం కూలీ పనులు చేసుకుందామన్నా కరువు. హైదరాబాద్‌ లాంటి నగరంలో కూడా పెద్దగా పనులు దొరికేవి కాదు. దాంతో పల్లె వాసులంతా ఎవుసం వదిలేసి, ఇల్లూ వాకిలి మర్చిపోయేవారు. మహారాష్ట్రకు వలసలు వెళ్లేవారు. ఒక వేళ తెలంగాణలో వుంటూ, ఊరిలోనే జీవితం గడిపే కొంత మంది రైతులు కేవలం వ్యవసాయం మీదే ఆధాపడి జీవనం సాగించేవారు. దాంతో ఎదుగూబొదుగూ లేని సంసారాలతో కుటుంబాలు గడిచేవి. ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో…ముఖ్యమంత్రి కేసిఆర్‌ తిరిగి వ్యవసాయాన్ని పునరుజ్జీవం చేశారు. సాగును పండగ చేశారు. ఎక్కడైతే నీటి చుక్క పారని ప్రాంతాలై, ఎడారులను తలపించిన తెలంగాణ పల్లెలకు నీరు తెచ్చాడు. చెరువులు నింపాడు. తెలంగాణ సస్యశ్యామలం చేశాడు. సాగుకు 24 గంటల కరంటు ఇచ్చాడు. దాంతో తెలంగాణలో వున్న ప్రతి రైతు అటు వ్యవసాయంతోపాటు, మరో ఏదో రకమైన వ్యవసాయమో, కుల వృత్తినో నమ్ముకొని ఆదాయ మార్గాలు పెంచుకుంటూ వస్తున్నారు. అటు సాగుకు ఢోకా లేదు. మరో వైపు ఏదైన ఇతర పనులకు కొదువలేదు. ప్రతి తెలంగాణలో సాగుతోపాటు పాడిని ఏర్పాటు చేసుకున్నాడు. మరి కొంత మంది కిరాణ షాపులు, చికెన్‌ సెంటర్లు, ఇలా వారి వారి నైపుణ్యలే కాదు, కుల వృత్తులు కూడా చేసుకుంటున్నారు. సాగుకు రైతు బంధు అదనంగా వస్తోంది. ఇలా తెలంగాణలోనే ఆదాయ వనరులు పుష్కలంగా ఏర్పాడ్డాయి. వాటికి తోడు ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజల్లో వెలుగులు నింపుతున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రతిపక్షాల వైపు ప్రజలు చూడడమే మానేశారు. వారి గురించి ఆలోచించేవారే లేరు. కేవలం పల్లెల్లో ప్రత్నామ్నాయ రాజకీయాలు చేయడం కోసం వున్నవారు తప్ప, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములౌతున్నవారంతా బిఆర్‌ఎస్‌లో వున్నారు. ప్రజలు కూడా పూర్తిగా బిఆర్‌ఎస్‌కు మాత్రమే మద్దతిస్తున్నారు. 

 ఇలాంటి పరిస్ధితి దేశంలో ఏ రాష్ట్రంలో లేదు.

 ప్రభుత్వ పధకాలు, ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వం ఎప్పుడో ప్రతిపక్షాలను మింగేశాయంటే అతిశయోక్తికాదు. తెలంగాణ ప్రజలకు ఇప్పుడు ప్రత్నామ్నాయ శక్తుల అవసరం లేదు. ఎందుకంటే ఆ పార్టీలలో కనీసం తెలంగాణ అంటేనే తెలియని నేతలున్నారు. తెలంగాణ పరిస్ధితులు తెలియని వాళురాజకీయాలు చేస్తున్నారు. ఇటీవలే పిసిసి. అధ్యక్షుడు రేవంత్‌ చేసిన కరంటు వ్యాఖ్యలు ఇందుకు నిదర్శం. తెలంగాణలో ఇసుక నేలలు ఎక్కువ. ఒక ఎకరం పొలం పారాలంటే నిరంతరం కనీసం తొమ్మిదిగంటల కరంటు అవసరం. అసలు తెలంగాణలో ఎలాంటి నేలలున్నాయో కూడా రేవంత్‌కు తెలియని పరిస్దితి. అలాంటి వాళ్లు మూడు గంటలు కరంటు ఇస్తే సరిపోతుందా? గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎనమిది గంటలు కరంటు ఇచ్చామని చెబుతుంటే అప్పుడు ఎందుకు సాగు సాగలేదో అర్ధమైతే రేవంత్‌ అలాంటి వ్యాఖ్యలు చేసేవారు కాదు. ఎందుకంటే కాంగ్రెస్‌ నాయకులకు సాగు మీద అవగాహన లేదు. రైతుల మీద ప్రేమ లేదు. రైతుకు ఎంత చేసినా తక్కువే అన్నది ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆలోచనకు, మూడు గంటల కరంటు చాలు అన్న రేవంత్‌ రెడ్డి ఆలోచనకు ఎంత తేడా వుందో ప్రజలకు తెలియదా? ఇక ఒకేసారి మూడు గంటల పాటు కరంటు ఇచ్చినా, మూడు గంటల కరంటు అంటూ సమయాలు నిర్ణయించినా, ఏక కాలంలో తెలంగాణలో రైతులంగా మోటార్లు ఆన్‌ చేస్తే ఏం జరుగుతుందో కూడా రేవంత్‌కు తెలియదు. గ్రిడ్‌ కుప్ప కూలి పోతుందన్న సంగతి కూడా తెలియకుండా రాజకీయాలు చేసేవారు ప్రజలు మేలు చేసే పనులు చేస్తారంటే ఎవరైనా నమ్ముతారా? అందుకే తెలంగాణలో ప్రతిపక్షాలు చోటు లేదు. అందులో కాంగ్రెస్‌ పార్టీని నమ్మేందుకు ప్రజలు సిద్దంగా లేరు. దేశాన్ని రెండుసార్లు పాలించేందుకు ప్రజలు అవకాశమిస్తే, ప్రజల జీవితాలను తలకిందులు చేసే నిర్ణయాలు తీసుకొని వ్యవస్దలను దెబ్బతీసిన బిజేపికి తెలంగాణలో చోటే లేదు. ప్రజల ఆదరణ అంతకన్నా లేదు. అసలు బిజేపి తెలంగాణలో మొత్తం పోటీ చేసేందుకు కూడా అభ్యర్ధులు లేరు. తెలంగాణ మొత్తంలో బిజేపికి పట్టుమని స్ధానాల్లో డిపాజిట్లు కూడా వస్తాయో లేదో అనుమానమే! తెలంగాణలో ఎదరులేని పార్టీ బిఆర్‌ఎస్‌. తిరుగులేని నాయకుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌. ముచ్చటగా మూడోసారి బిఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడమే కాదు. భవిష్యత్తు దేశ రాజకీయాలను కూడా తెలంగాణ ప్రభావితం చేయడం ఖాయం. ముఖ్యమంత్రి కేసిఆర్‌ నాయకత్వం కేంద్రంలో అవసర పడడం తధ్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!