ఆర్కేపి ఎస్సై జి రాజశేఖర్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణంలోని అన్ని ఏరియాలలో గంజాయి మత్తుకు అలవాటపడి బానిసలుగా మారిన కొంతమంది యువకుల ఇళ్లల్లోకి వెళ్లి రామకృష్ణాపూర్ పట్టణ ఎస్సై జి రాజశేఖర్ తనిఖీలు నిర్వహించారు. పోలీస్ సిబ్బంది డాగ్ స్క్వాడ్ సహాయంతో గంజాయి తాగే వారి ఇండ్లలో సోదాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజశేఖర్ మాట్లాడుతూ… యువకులు మత్తు పదార్థాలకు గంజాయికి దూరంగా ఉండాలని, బానిస కాకూడదని, గంజాయి విక్రయించిన, సేవించినా సరే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నామని అన్నారు. పట్టణంలోని ఏ ఏరియాలో అయినా సరే మత్తు పదార్థాలు విక్రయించిన, సేవించిన వారి వివరాలు పోలీసు వారికి తెలియజేయాలని ప్రజలను కోరారు. మత్తు పదార్థాలకు బానిసైన వ్యక్తుల సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని, సమాచారం అందించిన వారి నెంబర్లు, పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.