నిజాంపేట: నేటి ధాత్రి
పీఆర్టియు టీఎస్ మండల కార్యవర్గ ఎన్నిక శుక్రవారం మండల కేంద్రంలో జరిగింది. ఈ మేరకు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నామగండ్ల దేవేందర్, రాందేవ్ వెంకటేష్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల కోసం కృషి చేస్తామన్నారు. అసోసియేటెడ్ అధ్యక్షులుగా శ్రీనివాస్ కార్యదర్శిగా శ్రీకాంత్ మహిళా అధ్యక్షురాలు ఉమారాణి లను ఎన్నుకోవడం జరిగిందన్నారు.