సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామా యోగ

పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ మేగా ర్యాలీ

ఖమ్మం, నేటి ధాత్రి:

నేటి ఆధునిక జీవన విధానానికి అలవాటు పడిన ప్రజలు అనేక అనారోగ్యాలకు గురవుతున్నారని.
వీటన్నిటికీ సంపూర్ణ పరిష్కారమే యోగా అని వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరు యోగా చేయాలని పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాకం శ్యామ్ బాబు, కార్యదర్శి కొండమీద వెంకట్, కార్మిక నేత మంద వెంకటేశ్వర్లు, పాదం యోగా నిపుణులు సంధ్యా తెలిపారు.
ఈరోజు పెవిలియన్ గ్రౌండ్ లో 10వ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్బంగా వాకర్స్ అస్సోసియేషన్ మరియు పాదం యోగ ఆర్గ నైజేషన్ ఏర్పాటు చేసిన ఉచిత యోగ శిక్షణా నేపధ్యంలో ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించేందుకు పెవిలియన్ గ్రౌండ్ నుండి పాత బస్టాండ్ వరకు పెద్ద సంఖ్యలో నడక సాదకులు మరియు కరాటే శిక్షణ పొందుతున్న చిన్నారులతో కలిసి మేగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ. అంతర్జాతీయ యోగ దినోత్సవము ప్రతి సంవత్సరం జూన్ 21 న జరుపుకుంటారని తెలిపారు. 2014 సెప్టెంబరు 27న భారత ప్రధాని నరేంద్రమోడి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకొనుట కోసం ప్రతిపాదన చేశారని.ఈ తీర్మానానికి 193 ఐరాస ప్రతినిధులలో 175 మంది మద్దతు ఇచ్చారని భద్రతా కమిషన్‌లో శాశ్వత సభ్యులుగాఉన్న అమెరికా,ఇంగ్లాండ్,చైనా,ఫ్రాన్స్ , రష్యా వంటి దేశాలు కూడా ఈ తీర్మానానికి సహ ప్రతినిధులు. విస్తృతమైన చర్చల తరువాత డిసెంబర్ 2014 లో ఆమోదించబడిందన్నారు. 2015 జూన్ 21 న, మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు.జూన్ 21నే యోగా దినోత్సవం జరుపుకోవడానికి గల కారణం జూన్ 21 ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు.ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఆ రోజుకు ప్రత్యేకత కూడా ఉంటుందని. ఎక్కువ పగటి సమయం ఉన్న రోజుగా గుర్తింపు పొందడంతో అదే రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి భారత ప్రధానికి సూచనల చేసిందని తెలిపారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవం 2015 జూన్ 21న నిర్వహించిందన్నారు. భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ న్యూఢిల్లీలోని రాజ్‌పథ్‌లో నిర్వహించారు. ఆ వేడుకలకు చాలా దేశాలకు చెందిన నేతలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారని. 84 దేశాల నుంచి వచ్చిన నేతలతో పాటు మొత్తం 35,985 మంది యోగా చేసి రెండు గిన్నిస్ రికార్డులను నెలకొల్పారని కొనియాడారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం భారతదేశంలోని, ప్రపంచంలోని నగరాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో పాదం యోగ నిపుణులు శోభాదేవి,మమత, అర్వపల్లి నిరంజన్, దామోదర్ రెడ్డి, నర్సింహారావు,రామనాదం, వెంకట్ బాబు, శొంటీ వెంకట్,అంబాళ్ళ వెంకటేశ్వర్లు,శ్రీకాంత్, లక్ష్మణ్ రావు, శ్రీకాంత్, రమేష్,మంగ,పద్మ, తోటపల్లి కాశ్వీ, తెలంగాణ పోలీస్ ట్రైనర్ యం.బాబు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version