నర్సంపేట,నేటిధాత్రి :
నర్సంపేట అంగన్వాడి సెంటర్ 2 లో పిల్లలకు అవసరమైన కుర్చీలు,ఫ్యాన్లు ట్యూబ్లైట్, ఆట వస్తువులతోపాటు పలు రకాల వస్తువులను చేనేత ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు పెండెం శివానంద్ వితరణ చేశారు. ఈ సందర్భంగా శివానంద్ మాట్లాడుతూ అంగన్వాడి సెంటర్ కు సహకారం అందించడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి అంగన్వాడి సెంటర్లకు ప్రభుత్వ సహకారాలతో పాటు, దాతల సహకారం కూడా తప్పనిసరి పేర్కొన్నారు. అంగన్వాడి సెంటర్లకు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా మరింత ముందుకు వెళ్తాయని అన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి సెంటర్ టీచర్ గొర్రె రాధ, పాకాల మహిళా బ్యాంక్ అధ్యక్షురాలు పెండెం రాజేశ్వరి,పాలడుగుల రాంబాబు,పుల్లూరి రాజు గౌడ్, గడ్డమీది సతీష్,రామగోని సౌందర్య, హెల్పర్ కవిత తోపాటు అంగన్వాడీ పిల్లలు,తల్లులు పాల్గొన్నారు.