ములుగు జిల్లా కేంద్రం లోని కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులకు న్యాయం చేయాలంటూ దార్నా రాస్తారోకో

నేటి ధాత్రి రిపోర్టర్ ( ములుగు టౌన్)
ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతులకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగిన రైతులు. ఇటీవలీ కాలంలో పండించిన వరి (పచ్చి వడ్లు) ములుగులోని శ్రీ సాయి సహస్ర బైల్డ్ రైస్ మిల్ లో రైతుల నుండి కొనుగోలు చేశారు. అదే క్రమంలో సివిల్ సప్లై అదికారులు రైస్ మిల్ యాజమాన్యం కోట్ల రూపాయలలో అప్పు ఉండడం మూలంగా రైస్ మిల్లును సీజ్ చేశారు. దీంతో సుమారు 200 మందికి పైగా రైతులు పచ్చి వడ్లును శ్రీ సాయి సహస్ర బైల్డ్ రైస్ మిల్ లో అమ్మి మోస పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు రైస్ మిల్లర్ ను సీజ్ చేసినట్లుగా రైతులకు తెలిసే విధంగా ఎలాంటి ప్రకటనలు చేయకపోవడం మూలంగా నమ్మి రైస్ మిల్ యాజమాన్యం వద్ద సుమారు రెండు కోట్ల రూపాయల నష్టం మాకు వాటిలిందని రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికైనా సివిల్ సప్లై అధికారులు రైస్ మిల్ యాజమాన్యంతో మాట్లాడి రైతులకు రావాల్సిన రెండు కోట్ల రూపాయల డబ్బులు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వానికి సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *