భారత ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ

బిజెపి జమ్మికుంట పట్టణం శాఖ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తాలో టపాకాయలు పేల్చి స్వీట్లు పంపిణీ

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :

ఎన్డిఎ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికై దేశ ప్రజల ఆశీస్సులతో ముచ్చటగా మూడోసారి దేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీకి భారతీయ జనతా పార్టీ, జమ్మికుంట పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జమ్మికుంట పట్టణ గాంధీ చౌరస్తాలో టపాసులు పేల్చి స్వీట్లు పంచి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా జీడి మల్లేష్, శీలం శ్రీనివాస్ మాట్లాడుతూ, నరేంద్ర మోడీ గత 10 సంవత్సరాల కాలంలో పేద, మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారన్నారు. ఆ సంక్షేమ పథకాల ఫలాలతో సంతృప్తి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున పరోక్షంగా ఓట్లు వేసి మూడోసారి ప్రధానిగా నిలబెట్టారన్నారు. అదేవిధంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బండి సంజయ్ సామాన్య కార్యకర్త స్థాయి నుంచి బ్యాంకు డైరెక్టర్ గా, కార్పొరేటర్ గా కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా భాజాపా రాష్ట్ర అధ్యక్షులుగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై ఈసారి జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు నుండి భారీ మెజార్టీతో రెండు లక్షల 21 వేల చిల్లర ఓట్లతో గెలుపొంది మొదటిసారిగా కేంద్ర మంత్రిగా ఎన్నికయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జమ్మికుంట పట్టణ, నాయకులు, జిల్లా నాయకులు, వివిధ మోర్చా అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version