`పార్టీ, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తారా?
`కర్తవ్యం నాస్తి.. కామాయనం జాస్తి!

`బాధ్యతలకు సుస్తి…మహిళాధికారుల మీద జబర్థస్తి!
`దిక్కుమాలిన జర్నలిజం.. పనికి మాలిన రాజకీయం?
`అధికార మదం కైపు కావురం పెంచుతాయా?
`కన్ను మిన్ను కానకుండా కళ్ళు మూసుకు పోతాయా?
`పదవి బాధ్యతలు పక్కకు పోతాయా?
`కర్తవ్యం మరిచి, వేధింపుల కామాయనాలు పుట్టుకోస్తయా?
`పురుషాధిక్య సమాజంలో మహిళాధికారులంటే చిన్న చూపేనా?
`అధికారులైనా అబాగ్యలేనా.. మహిళా దికారులంటే చులకనేనా?
`సమాజంలో వారి గౌరవం ఎప్పుడూ తక్కువేనా?
`నాయకులు, అధికారులకు లోకువేనా?
`ఐఏఎస్ లంటే అంత ఆశామాషిగా వుందా?
`మహిళా ఐ ఏ ఎస్ అధికారులు అంత అలుసై పోయారా?
`మహిళా ఐ ఏ ఎస్ ల జీవితాల మీద అభండాలా?
`పరోక్షంగా మంత్రి ని హీరో ను చేస్తారా?
`ఏ రంగంలో వున్నా అవమానాలు, అనుమానాలు తప్పవా?
`మంత్రికేనా కుటుంబం వుండేది?
`ఆ మహిళా ఐ ఏ ఎస్ అధికారికి కుటుంబం ఉండదా?
`ఆల్ ఇండియా క్యాడర్ అధికారులపై ఊహజనిత వార్తలు సృష్టిస్తారా!
`మీడియా చేతిలో వుంది కదా ఎలాంటి కట్టు కథైనా అల్లేస్తారా?
`ఆ కలెక్టర్ అని చెప్పగలిగిన మీడియా మంత్రి పేరు ఎందుకు దాచారు?
`మహిళా కలెక్టర్ పరువు పోయినా పర్వాలేదనుకున్నారా?
`ఐ ఏ ఎస్ ల సంఘం ఏం చేస్తున్నట్లు?
`మహిళా ఐ ఏ ఎస్ ఆత్మభిమానం మీద దెబ్బ కొడుతుంటే చూస్తూ ఓరుకుంటారా?
`మహిళా కమిషన్ ఏం చేస్తోంది?
`తోటి మహిళా ఐ ఏ ఎస్ అధికారులు మాకెందుకు అనుకుంటున్నారా?
`ఓ మంత్రి మహిళా ఉన్నతధికారిని వేడిస్తున్నాడు? అని వార్త వస్తే స్పందించరు?
`ఓ మంత్రిని హీరో ను చేస్తూ అధికారి మీద స్టోరీ చేస్తే ప్రశ్నించరు?
`మహిళా ఐ ఏ ఎస్ పేరు బైటకొచ్చినా పరవాలేదా?
`మంత్రి పరువు మాత్రం భద్రమా?
`ఇదెక్కడి దిక్కుమాలిన జర్నలిజం?
హైదరాబాద్, నేటిధాత్రి: అధికార మదం తలకెక్కితే అవలక్షణాలన్నీ బైటపడతాయంటే ఇదేనా? ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పెద్దల మీద మీడియాలో రాకూడని వార్తలు వస్తున్నాయి. పాలకులే ఇలా ప్రవర్తిస్తుంటే, వ్యవహరిస్తుంటే సామాన్యులు ఎలా తయారౌతారన్న ఇంగితం కూడా లేకుండాపోతుందా? అనే చర్చ రాష్ట్రంలో మొదలైంది. ప్రజలను పాలించే పెద్దలు ఎంత హుందాగా వుండాలి. ఎంత ఆదర్శంగా వుండాలి. సమాజానికి ఎలాంటి సందేశమివ్వాలి. అన్నది మర్చిపోతున్నారా? గతంలో కూడా పాలకుల మీద ఇలాంటి విమర్శలు వచ్చినవే. అందుకే ప్రజలు ఆ నాయకులు పక్కన పెట్టారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా ఇలాంటి నీచ కార్యకాలపాలు చేసిన వారు కూడా వున్నారు. అది మంచి సంప్రదాయమనుకొని ఇప్పటి నాయకులు కూడా అనుసరిస్తున్నారా? రాజకీయీలను ఎటు తీసుకువెళ్తున్నారు? ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటూ ఎలా పాలన సాగిస్తారు? ప్రజలకు చెప్పుకోలేని విషయాలలో సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్దితులు తెచ్చుకోవడం స్వయం కృతం కాదా? ఇంతగా ఎందుకు భరితెగిస్తున్నారు? అడిగే వారు లేరనా? అడిగే శక్త ఎవరికీ వుండదనా? చాటు మాటు వ్యవహారాలను బైటకు వచ్చేలా వ్యవహరిస్తూ, మాంసంతిన్న పిల్లి బొక్కలు మెడలేసుకొన్నట్లు కనిపిస్తారా? నాయకులను, పార్టీని నమ్మి లక్షలాది మంది కార్యకర్తలున్నారు. పార్టీ కోసం సేవ చేస్తున్నారు. పార్టీని బతికించుకుంటున్నారు. నాయకులకు ఎన్నుకుంటున్నారు. పాలించమని చట్ట సభలకు పంపిస్తున్నారు. కాని కొందరు నాయకులు చేస్తున్న పని ఏమిటి? ఇలా వార్తలు బైటకు రావడమేమిటి? ప్రజల్లో చులకనైపోతామన్న భయం లేదా? జనం చీ కొడతారన్న ఆందోళన కూడా లేదా? సరే నాయకులు ఏమైనా చేసుకోని? కాని ఉన్నత స్దానాలలో వున్న ఐఏఎస్‌వ మహిళా అదికారుల జీవితాలు బజారున పడేస్తున్నారు. బైటకు వస్తున్న వార్తలో నిజమెంతో తెలియదు. కాని ఆ అదికారుల జీవితాలలో నిప్పుల పోస్తున్నారు. అరవై ఏళ్ల వయసుకు దగ్గరున్న ఓ మంత్రి , ఓ ఐఎఎస్ మహిళా అదికారితో సాన్నిహిత్యం అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ మంత్రి కుటుంబ సభ్యులకు కూడా వ్యవహారం తెలిసిందని అంటున్నారు. అంటే ఆ మంత్రి పేరు చెప్పే ధైర్యం లేనప్పుడు ఆ మీడియా కూడా భరితెగింపును ప్రదర్శించడం సరైంది కాదు! దమ్ముంటే ఆ మంత్రి పేరు చెప్పలేనప్పుడు జర్నలిజానికి విలువేముంది! ఆ కలెక్టర్ ఎవరో తెలిసేలా వార్తలు ప్రసారం చేశారు. అంటే పరోక్షంగా ఆ మంత్రిని హీరోను చేశారు. తప్పు చేసిన మంత్రి మాత్రం హరో అయ్యాడు. నిజమో కాదో తెలియని వార్తతో ఆ ఐఏఎస్ అధికారి సమితను చేస్తారా? కుటుంబం అంటే మంత్రికే వుంటుందా? ఆ మహిళా అదికారికి వుండదా? ఆమెకు గౌరవం లేదా? నిజంగా మీడియాకు దైర్యముంటే మంత్రి గారి లీలలు అని వార్తను ప్రసారం చేయాలి. కాని ఈ వయసులో కూడా ఇలా వున్నాడంటే..ఆ వయసులో ఎలా వుండేవాడో ఆ మంత్రి అని ప్రజలు గొప్పలు చెప్పుకోవడానికి వార్తను ప్రసారం చేశారా? ఆ వార్తను ప్రసారం చేయడంలో ఔచిత్యమేమిటి? ఎలా చూసినా ఆ మహిళా అదికారి బాదితురాలే! అలాంటప్పుడు మంత్రిని హీరోను చేసేలా వార్తను ప్రసారం చేసి, ఆ మహిళా అదికారి కళంకితరాలన్నట్లు అర్దమొచ్చేలా వార్తలను వండడం జర్నలిజమనిపించుకోదు! మంత్రిగారు గొప్ప రసికాగ్రేసరుడు అనేది చెప్పదల్చుకుంటే వార్తలోకి ఆ మహిళా అదికారిని తీసుకురావాల్సిన అవసరం లేదు. కాని పనిగట్టుకొన్నట్లు ఎన్ టివి. అనే మీడియా కూడా మహిళాధికారిదే తప్పన్నట్లు చూపించారు. మంత్రి గారి ఇంట్లో అల్లరౌతుందని ఆ స్టోరీతో చెప్పదల్చుకున్నారా? మంత్రి పదవి మహాఅయితే ఓ ఐదేళ్లు. కాని ఓ ఐఏఎస్ అదికారి ఉద్యోగం శాశ్వతం. నిజంగా ఆ మహిళా అదికారి నిర్వాకం వల్ల మంత్రి జీవితం ఆగమైపోయి వుంటే వార్తను ప్రసారం చేయడంలో తప్పు లేదు. కాని అక్కడ ఆ మంత్రి కుటుంబం కలత చెందుతోందని, ఆ మహిళా అధికారి వలలో మంత్రి చిక్కుకున్నాడనే అర్దం సృరించేలా వార్తను ప్రసారం చేశారు. ఎంతటి ఉన్నత స్దానంలో వున్నా మహళలు అవమానాలు, అనుమానాలు ఎదుర్కొవాల్సిందేనా? ఇందులో పురుషాదిక్య సమాజపు విషపు కోరలు కనిపించడం లేదా? ప్రజలు ఎన్నుకొని పాలన సాగించమని బాద్యత అప్పగించిన ప్రజలకు సేవ చేయడం కోసమా మంత్రి పదవి? లేక తన తలతిక్క పనుల కోసం పదవిలో కొనసాగుతున్నారా? ప్రజలకు సేవ చేస్తానని చెప్పి, ఒప్పించి, మాటిచ్చి వాగ్దానాలు కురిపించి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రి పదవి వరించింది ఇందుకేనా? మహిళా అదికారుల మీద జబర్దస్తీ చేయడానికేనా మంత్రులైంది? ఇదిలా వుంటే మరో మంత్రి కావురం మీద కూడా కథనాలు వస్తున్నాయి. మహిళాదికారులంటే అంత చులకనైపోయిందా? మహిళా జర్నలిస్టులపై కూడా మంత్రుల కన్ను పడుతోందా? ఇది సమాజానికి మంచి పరిణామమేనా? రాజకీయాలకు తగునా? దానితోపాటు ఏకంగా సిఎం.ఓ కార్యాలయంలోనే ఏదో జరిగిపోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై పాలకులు స్పందించకపోవడం అంటే మౌనం అంగీకారమన్నట్లే అవుతుంది. ఆ వార్తల్లో నిజమున్నట్లే అని ఒప్పుకున్నట్లౌతోంది. ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారా? లేక ఇంకా కూడా మంత్రుల్లో ఇలాంటి కామకంత్రీలున్నారా? బైట వంద వేషాలు వేసుకున్నా ఎవరూ పట్టించుకోరు? కాని అదికారులనే టార్గెట్ చేసేలా వారి లోబర్చుకునేలా మంత్రులు వ్యవహరించడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఉద్యోగ వర్గాలు ఏం చేస్తున్నాయి? ఉన్నతోద్యోగంలో వున్న వారికే ఇలాంటి పరిస్తితులు వుంటే న్యాయం ఎవరు చేస్తారు? ఐఎఎస్ మహిళా అదికారులను ఆపై వున్న పురుషాదికారులు వేదిస్తుంటారు! ఇటు నాయకులు వేదిస్తుంటారు! మంత్రుల స్దానంలో వున్న వారు కూడా వేదింపులకు గురి చేస్తే పాలన ఏలా సాగుతుంది? ప్రభుత్వం ఏం పని చేస్తుంది? మహిళా ఐఏఎస్ అదికారులంటే నాయకులకు, పాలకులకు, ఉన్నతాదికారులకు అంత అలుసైపోతున్నారా? వారిని వేదింపులకు గురిచేయడం కూడా హక్కుగా భావిస్తున్నారా? పాలనా పరమైన వేదింపులు వేరు? నాయకులు, మంత్రులు తమకు కావాల్సిన పనులను ఐఏఎస్ అదికారులపై ఒత్తిడి తెచ్చి , బెదింపులకు గురి చేసి పనులు చేయించుకోవడం వేరు? కాని లైంగిక వేదింపులు చేయడం నేరమన్న సంగతి తెలియకుండానే నాయకులు, పాలకులయ్యారా? ఐఏఎస్‌ల సంఘం ఏం చేస్తోంది? ఈ మధ్య మహిళా ఉన్నతాదికారులపై వేదింపులనే వార్తలు తరుచూ వింటున్నాం. ఏకంగా మంత్రి వ్యవహారం వల్ల ఓ ఉన్నతోద్యోగి జీవితమే తలకిందులయ్యే పరిస్దితి వచ్చింది! రాష్ట్రమంతా మాట్లాడుకుంటున్నారు! అయినా ఆ ఉద్యోగ సంఘాలు నోరు విప్పవా? అదే పురుష ఐఏఎస్ మీద అవినీతి ఆరోపణలు వస్తే స్పందించిన యూనియన్ నాయకులు ఇలా మహళా ఐఏఎస్ అదికారి మీద వార్తలు వస్తే స్పందించరా? ఐఏఎస్ అదికారుల్లో కూడా రెండు గ్రూపులున్నట్లు? దక్షిణాది అదికారులపై ఎలాంటి ఆరోపణలు వచ్చినా స్పందించరనే అపవాదు వుంది? అది నిజమేనా? అదే ఉత్తరాది ఐఏఎస్‌లు అయితేనే స్పందిస్తారని అనుకుంటారు? అది నిజమేనా? మహిళా ఐఏఎస్ పరువు పోయినా ఫరవాలేదని అనుకుంటున్నారా? ఆమె ఆత్మాభిమానం దెబ్బతింటుంటున్న భావన ఐఏఎస్ అదికారుల సంఘానికి లేదా? పైగా మహిళా కమీషన్ ఏం చేస్తోంది? సమాజంలో ఇటీవల జరిగిన ఓ వివాదం మీద స్పందించిన కమీషన్, ఓ మంత్రిగారి బాగోతంలో మహిళా అదికారి బలౌతుంటే స్పందించరా? దానిని సుమోటోగా స్వీకరించి ఆ మహిళా అదికారిపై పడిన అబాంఢాన్ని తొలగించరా?