సముద్రం తలాపున ఉండగా చేప ధూపకేడిసినట్టుంది

గణపురం మత్స్య కార్మికుల వలసలు
కాంట్రాక్టర్ల వాళ్లలో ఘనప సముద్రం చేపలు

నష్టపోతున్న మత్స్య కార్మికులు

గణపురం నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో కాకతీయుల రాజు లు నిర్మించిన ఘనప సముద్రం చేపలు కాంట్రాక్టు వలలో చిక్కుకు పోతున్నాయి ఈ మేరకు కాంట్రాక్టు చేపలు అమ్మడానికి బలవంతంగా తీర్మానం చేయించినట్లు మత్స్య కార్మికులు చెబుతున్నారు సంఘ పెద్దలు కొందరి ఆధ్వర్యంలో ఇది జరిగినట్లు ప్రచారం సాగుతుంది కొందరు మత్స్య కార్మికులను బజారు పాలు చేసేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణలు ఉన్నాయి కావాలని కాంట్రాక్టు చేత ఐదులక్షల చేప పిల్లలు రొయ్య పిల్లలను చెరువులో పొయించినందుకుగాను కిలో చేప పిల్లలను రూ 60 కి లో రొయ్య పిల్లలకు 120 చొప్పున మత్స్య కార్మికులు కాంట్రాక్టర్లకు అమ్మడానికి తీర్మానం చేశారని చెబుతున్నారు కాగా గణపురం చెరువులో కాంట్రాక్టర్ చేత చేప పిల్లలను పోయడంతో పాటు చేపలు రొయ్యలకు కాంట్రాక్టు చెప్పిన ధరకు అమ్మడానికి గణపురం మత్స్య కార్మికులు పలువురు వ్యతిరేకించారు గణపురం ఫిషరీ సొసైటీలో కాంట్రాక్టర్లు మధ్య దళారులు చొరబడి మత్స్య కార్మికుల పొట్ట పొట్టేందుకు ప్రయత్నం చేయడంతో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది ఇప్పుడు మత్స్య శాఖ వారు జోక్యం మత్స్య కార్మికులు మార్కెట్లో స్వేచ్ఛగా చేపలను రొయ్యలను గిట్టుబాటు ధరకు అమ్ముకునేలా చర్యలు తీసుకోవాలని పలువురు మత్స్య కార్మికులు కోరుచున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *