పెండింగ్ లో ఉన్న 5.485 కోట్ల మెస్ కాస్మోటిక్ చార్జీలు డైట్ బిల్లులు
పెండింగ్లో ఉన్నటువంటి 7.500 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రివర్మెంట్ వెంటనే విడుదల చేయాలి
ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజు డిమాండ్
భూపాలపల్లి నేటిధాత్రి
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న 5.485 కోట్ల మెస్ కాస్మోటిక్ చార్జీలు అదేవిధంగా డైట్ బిల్లులు పెండింగ్ లో ఉన్నటువంటి 7.500 కోట్ల పైగా స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని జిల్లా కమిటీ డిమాండ్ చేయడం జరిగింది. అనంతరం ఎస్ఎఫ్ఐ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి కుమ్మరి రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ బీసీ సంక్షేమాల శాఖల పరిధిలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్న 5.485 కోట్ల రూపాయలు డైట్ బిల్లులు తక్షణమే విడుదలకై తమరు వైపు నుండి తగు చర్యలు తీసుకోగలరని మనవి చేయడం జరిగింది అదేవిధంగా గురుకులాలు కేజీబీవీలు ఆశ్రమ పాఠశాలలు జనరల్ ఫ్రీ మెట్రిక్ పోస్టుమట్రిక్ హాస్టల్స్ లో నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు సకాలంలో డైట్ బిల్లులు ఇవ్వ ఇవ్వని కారణంగా విద్యార్థులకు నిర్దేశించిన మెను ప్రకారం భోజనం అందించడానికి ఆటంకంగా మారింది కొన్ని చోట్ల సంక్షేమ వసతి గృహాల అధికారులు అప్పులు చేసి పెడుతున్నామని ఇంప్లిమెంట్ చేయడం లేదు ఏ శాఖలో కూడా పెరిగిన ధరలో కారణంగా టెండర్ల ప్రకారం నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం లేదు డైట్ బిల్లులు సకాలంలో విడుదల అయ్యేలా తగు చర్యలు తీసుకోగలరు అని చెప్పడం జరిగింది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ సంబంధించి సొంత భవనాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం దీన్ని దృష్టిలో ఉంచుకొని తగు చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరిగింది