– రాజన్న సిరిసిల్ల బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి
సిరిసిల్ల(నేటి ధాత్రి):
సిరిసిల్లలో బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ బిజెపిలో కష్టపడ్డ వాళ్లకి ఫలితం దక్కుతుందని దీనికి ఉదాహరణకు నేనేనని తెలపడం జరిగింది. నా పదవికి సహకరించినటువంటి కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణకు కృతజ్ఞతలు తెలపడం జరిగింది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగుర వేసేందుకు ప్రయత్నం చేస్తానని అన్నారు.
పట్టభద్రులను ఓటు అడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు.
ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చారని, ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని అన్నారు.
పట్టభద్రులు, ఉపాధ్యాయులకు
ఏ కష్టం ఎదురైనా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని అన్నారు.
ఉపాధ్యాయులందరూ మల్క కొమురయ్యకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు.
గ్రాడ్యుయేట్స్ అంజి రెడ్డిని గెలిపించాలని అన్నారు.
ఇప్పుడున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో మూడు స్థానాలను కైవసం చేసుకుంటామని అన్నారు.