రోత పుట్టించే రాతలు రాస్తే భవిష్యత్తులో చూస్తూ ఊరుకోము 

– ఎన్నికల కోడ్ అమల్లో ఉందని చెప్పడం తప్ప 

– జిల్లా కలెక్టర్ చట్టాన్ని సంరక్షిస్తే వారిపై నిందలు వేయడం సరికాదు 

– భూభాగోతాలు, డబల్ బెడ్ రూమ్ లలో అవినీతి, ప్రభుత్వ నిధులను దుర్వినియోగం

– ప్రభుత్వ విప్ ఆది, కేకే 

సిరిసిల్ల(నేటి ధాత్రి):

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ

బిఆర్ఎస్ పార్టీ బరితెగించి ముందుకు పోతుందనడనికి నిదర్శనం వారూ మానసిక ఆనందం పొందడానికి సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టింగ్లేనని అన్నారు.

రోత పుట్టించే రాతలు పిచ్చి పిచ్చి ప్రేలాపనలు బిఆర్ఎస్ నాయకులు చేస్తున్నారన్నారు.

సిరిసిల్ల బిఆర్ఎస్ భవన్ కబ్జాకు గురైన ప్రాంతం నుండి ఐఏఎస్ అధికారిని పట్టుకొని అనరానీ మాటలు అన్న రోజు మేము తీవ్రంగా ఖండించడం జరిగిందన్నారు.

ఐఏఎస్ లకు క్షమాపణ చెప్పాలని ఆనాడు మేము డిమాండు చేశామని అన్నారు.రాష్ట్ర ఐఏఎస్,ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ల సంఘాలు కేటీఆర్ ను వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని హెచ్చరికలు జారీచేసిన వారి ఆలోచన విధానంలో మార్పు రాలేదన్నారు. 

రెండు రోజులుగా సోషల్ మీడియాలో ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీ ద్వారా దుబాయ్ కేంద్రంగా నడపబడుతున్న కొన్ని సోషల్ మీడియాల అకౌంట్స్ ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ పై అనేక ఆరోపణలు చేస్తున్నారన్నారు.

జిల్లా కలెక్టర్ చట్టాన్ని సంరక్షిస్తే వారిపై నిందలు వేస్తున్నారన్నారు.

గత ప్రభుత్వం హయంలో సుమారు వెయ్యి ఎకరాల పైన ప్రభుత్వ భూములు కబ్జాలు చేశారన్నారు.

నేను పట్నంలో కబ్జా చేస్తా మీరు పల్లెలో కబ్జా చేయండి అన్నట్లుగా కేటీఆర్ తీరు ఉందన్నారు.

కబ్జా చేసిన భూభాగోతాలు వెలికి తీసి చట్టాన్ని కాపాడే విధంగా ప్రభుత్వమిచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే మీకు కంట్లో నాలసయ్యాడని భావించి వారు కబ్జా చేసిన భూములను ప్రభుత్వానికి వెళ్ళిపోతాయని భావిస్తూ కలెక్టర్ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూస్తున్నారన్నారు.

ఇంతకంటే నీచమైన సంస్కృతి మరొకటి ఉంటుందా?

మీరు టెలిఫోన్ ట్యాపింగ్ చెసి జడ్జిలు, సినిమా తారలు, భార్యాభర్తలు మాట్లాడుకున్న మాటలు విన్నారే ఇదేనా మీ సంస్కృతి అని అన్నారు.

అందుకే మొన్నటి ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టడం జరిగిందన్నారు..

ప్రజలు ప్రజాధనాన్ని, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని ప్రజా ప్రభుత్వానికి అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు…

సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ ఉన్నతాధికారులను ట్రోల్ చేయొద్దని మీ కార్యకర్తలకు చెప్పాల్సింది పోయి కేటీఆర్ ట్విట్టర్లో ట్వీట్ చేయడం పద్ధతి కాదని అన్నారు. స్వయానా జిల్లా కలెక్టర్ నా పైన ఎలాంటి కేసు లేదని ప్రకటించిన కేసులు ఉన్నాయని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు.

వ్యక్తిగత జీవితంపై తప్పుడు ఆరోపణలు చేసిన వారు వెంటనే క్షమాపణలు చెప్పాలని అన్నారు.

ఎలక్షన్ కోడ్ అమలులో ఉండి రాజకీయ నాయకుల ఫోటోలు, శిలాఫలకాలు ముసుగు వేస్తారన్న సంగతి మీకు కూడా తెలియదా అన్నారు.

మీ బొమ్మలతో ప్రభుత్వ స్థలంలో కట్టిన టీ స్టాల్ లో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని చెప్పడం తప్ప అన్నారు.

ఉపాధి పోగొట్టాలని ఆలోచన మాకు లేదన్నారు.

చిరు వ్యాపారులకు మేము వ్యతిరేకం కాదన్నారు.

కేటీఆర్ మాట్లాడుతూ నేను లెక్కపెడుతున్న రాసి పెడుతున్న అసెంబ్లీలో కూర్చుని రాస్తున్న అనడం చూస్తుంటే ఏమనాలో అర్థం కావడం లేదన్నారు.

ఒకరేమో బ్లాక్ బుక్ అని, ఒకరు రెడ్ బుక్ అని కొత్తగా పింక్ బుక్ అంటున్నారు..

మీ పదేండ్ల అవినీతి అక్రమ పాలనలో మా కార్యకర్తలపై ఎన్ని కేసులు పెట్టిన మేం భయపడలేదన్నారు.

ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో రాజకీయ నాయకుల ఫోటోలు ఉండరాదని నియమనిబంధనలు చెప్తుంటే కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారన్నారు.

మేము ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలయ్యేలా చూడాలని కోరుతున్నామాన్నారు.

జిల్లా కలెక్టర్ ను టార్గెట్ చేస్తూ రోత పుట్టించే రాతలు రాస్తే భవిష్యత్తులో చూస్తూ ఊరుకోమని అన్నారు.

డబల్ బెడ్ రూమ్ ఇళ్లలో కూడా అవినీతి జరిగిందన్నారు.

సిరిసిల్ల ప్రాంతంలో జరిగిన భూభాగోతాలు, డబల్ బెడ్ రూమ్ లలో అవినీతి, ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన వారిని వదిలిపెట్టమని అన్నారు.

ప్రభుత్వo అధికారులకు అండగా ఉంటుందన్నారు.

భూ కబ్జా చేసిన వారు, డబల్ బెడ్ రూమ్ ఇళ్లలో అవినీతి చేసిన వారు , రోడ్లు వేసి బిల్లు తీసుకొని మళ్ళీ రెండోసారి బిల్లు తీసుకున్న వారు స్వచ్ఛందంగా తిరిగి ప్రభుత్వ సొమ్మును ఇచ్చేయాలని అన్నారు.

ప్రభుత్వ అధికారుల మనోధైర్యం కోల్పోయేలా మీరు చేసే ప్రయత్నాన్ని చూస్తూ ఊరుకోమన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, ఆడెపు చంద్రకళ, రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా అధ్యక్షురాలు కామిని వనిత, మార్కెట్ కమిటీ చైర్మన్ పట్టణ అధ్యక్షురాలు వెలుముల స్వరూప, కల్లూరి చందన,కూడిక్యాల రవి,కోడం అమర్నాథ్, గుండ్లపెల్లి గౌతమ్, శ్రీకాంత్, జిల్లా పట్టణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!