చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డు భరత్ నగర్ లో 30 లక్షల ఎస్ డి ఎఫ్, డి ఎం ఎఫ్ టి నిధులతో నిర్మించిన డ్రైనేజీ,సిసి రోడ్డును చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని, మున్సిపాలిటిని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, మున్సిపల్ కమిషనర్ జి రాజు, ఏ ఈ అచ్యుత్,ఏడవ వార్డ్ కౌన్సిలర్ పొలం సత్యం, ఓడ్నాల శ్రీనివాస్, నీలం శ్రీనివాస్ గౌడ్,మెట్ట సుధాకర్,అక్కల లచ్చన్న,గోపతి బానేష్,వెంకట్ రెడ్డి, భరత్ నగర్ ప్రజలు, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.