రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో
శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం వేద పండితులు ఆలయ ప్రధాన అర్చకులు అంబా ప్రసాద్,రామకృష్ణ,శరత్ శర్మ,సాయి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా బుధవారం నిర్వహించారు.
అయోధ్యలో పవిత్రమైన శ్రీ బాల రాముడి విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించి సంవత్సరము అయినా సందర్భంగా వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా కోదండ రామాలయంలో శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి శాంతి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. సీతారాముల కల్యాణ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ దేవేందర్ దంపతులు పాల్గొన్నారు. గోమాత దీక్షా స్వాముల దంపతులు పాల్గొన్నారు. అనంతరం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ కోదండ రామాలయ కమిటీ వారు తీర్థప్రసాదాలు అందించారు.