లాభాల వాటా, దీపావళి బోనస్ ఇప్పించిన ఘనత ఏఐటియుసిదే..
సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్
భూపాలపల్లి నేటి ధాత్రి
మెడికల్ బోర్డు లో జరుగుతున్న అవినీతి దందా ను సమూలంగా నిర్మూలిస్తామని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ అన్నారు . గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కొమురయ్య భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ మాట్లాడుతూ… ఎన్నికలు కాక ముందు నుంచి రిటైర్డ్ కార్మికులకు రావలసిన 32% లాభాల వాటా, 11వ వేజ్ బోర్డు ఏరియర్స్, దీపావళి బోనస్ చెల్లింపు, కోసం అనేక సార్లు యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి ఇప్పించిన ఘనత ఏఐటీయూసీదే అని అన్నారు. ఏఐటియుసి గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత సింగరేణి సి & ఎం.డి బలరాం నాయక్ ను ఈ నెల 8న కలిసి రిటైర్డ్ కార్మికులకు చెల్లించవలసిన బకాయిలను వెంటనే వారి వారి అకౌంట్స్ లో జమ చేయాల్సిందిగా కోరుతూ వారికి మెమోరాండం ఇవ్వడం జరిగిందని తెలిపారు. దాని ఫలితంగా ఈ 19న లాభాల్లో వాటా 32 శాతం చెల్లిస్తారని అన్నారు. అట్లాగే ఈనెల 21 దీపావళి బోనస్ చెల్లింపునకు వచ్చే నెల 06న 11వ ఏజ్ బోర్డు ఏరియర్స్ చెల్లింపునకు యాజమాన్యం అంగీకరించిందని వివరించారు. ఇలాంటి అనేక మంది కార్మికు సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి ఇప్పించిన ఘనత ఏఐటియుసి కార్మిక సంఘానికి దక్కుతుందని అన్నారు.
అలాగే మెడికల్ బోర్డులో ఎలాంటి అవినీతికి జరగకుండా పారదర్శకంగా మెడికల్ బోర్డు జరిగేలా చూస్తామన్నారు. గతంలో మాదిరిగా వి ఆర్ఎస్ పద్ధతిలో తండ్రి కొడుకుల ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కొత్తగా చేరే యువ కార్మికుల పేర్లలో చిన్నచిన్న తప్పులు ఉండడం వలన వారి తప్పులను హెడ్ ఆఫీస్ కి పంపించకుండా అక్కడే సరిచేసి ఉద్యోగం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. కార్మికులకు వచ్చే ప్రమోషన్లు విషయంలో కూడా పారదర్శకంగా వ్యవహరించి ఇలాంటి పైరవీలకు తావు ఇవ్వకుండా ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా పోరాటాలు చేస్తామని కార్మికుల హక్కుల సాధనలో ఏఐటీయూసీ ముందుంటుందని ఈ సందర్భంగా కార్మికులకు గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ కార్యదర్శి మోటా పలుకుల రమేష్, వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, ఫిట్ సెక్రెటరీ ఎండి కరీముల్లా, రాజారాం తదితరులు పాల్గొన్నారు.