అల్లం రఘునారాయణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు
పరకాల నేటిధాత్రి
వరంగల్ పార్లమెంటు ఎస్సీ రిజర్వేషన్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ నాయకుడు,దళిత పేద వర్గాల వారికీ అందుబాటులో ప్రజల మధ్యనే ఉంటున్న దొమ్మటి సాంబయ్యకే టికెట్ కేటాయిం చాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు అల్లం రఘు నారాయణ అన్నారు.ఉద్యోగమును వదిలి ప్రజా సేవ చేసేందుకు వచ్చి ఎంతో కాలంగా జిల్లాలో,పలు మండలాల స్థాయిలో పరిచయస్తుడిగా ఉంటూ అందరి మన్ననలు పొందు తున్నారని,ఉమ్మడి జిల్లాలో అందరికీ సుపరిచితులైన అందరి మన్ననలు పొందిన దళిత నేత సాంబయ్యకు ఎంపీ టికెట్ అవకాశవిస్తే ఈ ప్రాంతమంతా ఆయనకు గెలుపు ఇస్తారని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపీ టికెట్ ఇచ్చి అతనికి సహకరించాలని అన్నారు.