తంగళ్ళపల్లి నేటి దాత్రి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక ప్రెస్క్లబ్లో ఏర్పడిన పత్రిక సమావేశంలో వారు మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీ వాళ్లు అధికారంలో ఉండి అమలు చేయలేని హామీలు ఎన్నో ఉన్నాయని బీ ఆర్ఎస్ పార్టీ నాయకులు వారి నాయకులను హామీలు నెరవేర్చలేదని అడిగే దమ్ము వలకున్నదా అంటూ ప్రశ్నించారు అందుగురించి తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు అలాగే నూతనంగా ఏర్పాటైన తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో ఒక బీసీ నాయకుడు కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ తెలంగాణ ఉద్యమకారుడు విద్యార్థి దశ నుండి ఉద్యమాల ఊపిరిగా ఎల్లప్పుడూ ప్రజాక్షేత్రంలో అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేసిన బడుగు బలహీన వర్గాల నాయకుడు బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పై మొన్నటి రోజున సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి అభినందన సభలో పొన్నం గారు కార్యకర్తలపై ఉన్న చనువుతో కార్యకర్తలను ఉద్దేశించి సూచనలు చేస్తూ చేశారే తప్ప ఎలాంటి ఉద్దేశం లేదని బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పోన్నం ప్రభాకర్ విషయాలను వక్రీకరించి సోషల్ మీడియాలో పెడుతున్నారని ఈ విషయాన్ని పార్టీ తరఫున ఖండిస్తున్నామని తెలియజేస్తూ కెసిఆర్ కేటీఆర్ దోపిడీ దోరతానాన్ని ప్రశ్నించే దమ్ము లేదని బీ ఆర్ఎస్ పార్టీ వాళ్లు పోన్నంపై విమర్శలు చేయడం సరికాదని ఈ సందర్భంగా తెలియజేశారు బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు ఏ రకంగా ఉన్నారు అని ప్రజలందరికీ తెలుసునని అసత్య ప్రచారాలు మానకపోతే ప్రజాక్షేత్రంలో సరైన టైంలో ప్రజలు ప్రభుత్వం తగిన గుణపాఠం చెబుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు