వనపర్తి లోసీఎం రెండవ కప్ క్రీడలు
వనపర్తి నేటిదాత్రి .
సి.యం. కప్ రెండవ క్రీడలు శుక్రవారం వనపర్తి పట్టణంలోని దివంగత మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాలక్రిష్ణయ్య క్రీడా మైదానంలో వనపర్తి ఎమ్మెల్యే మేగారెడ్డి రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివశేనరెడ్డి జిల్లా కలెక్టర్ఆదర్శ్ సురబి ఎస్పీ సునితారెడ్డి క్రీడా జ్యోతిని వెలిగిం చారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేఘా రెడ్డి మాట్లాడుతూ వనపర్తి జిల్లాలోని క్రీడాకారులకు అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు వనపర్తి క్రీడాకారులు జాతీయస్థాయిలోఎదిగేందుకు సహకారం అందిస్తామని చెప్పారు క్రీడాకారులకు స్పూర్తినిచ్చేందుకు పులి.జింక గురించి వివరించారు. జింక కంటే పులి తక్కువ వేగంతో పరిగెడుతుందని కానీ జింకను ఎలాగైనా పట్టుకోవాలనే పట్టుదలతో ఉంటుందని అదే జింక ఎక్కడ నేను దొరికిపోతానో అనే భయంతో పరిగెడుతూ పులికి దొరికిపోతుందన్నారు క్రీడాకారులు కూడా విజయం కొరకు పోటీ పడాలని వివరించారు వనపర్తి జిల్లాకు వనపర్తి పట్టణనికి క్రీడాపర్తి పేరు ఉన్నదని వనపర్తి జిల్లా వనపర్తి పట్టణం నుండి క్రీడాకారులు జాతీయ స్థాయిలో వెళ్ళారని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి వనపర్తి ప్రభుత్వ బాలుర పాఠశాలలో చదువుకొని మైదానంలో ఫుట్ బాల్ ఆడారని ఇదే మైదానంలో ఆడుతున్న క్రీడాకారులు ముఖ్యమంత్రి స్ఫూర్తిని పొందాలని సూచించారు వనపర్తి లో ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 55 లో 25 ఎకరాల స్థలంలో స్పోర్ట్స్ స్కూల్ కు కేటాయించడం జరిగిందని ఎమ్మెల్యే మేగారెడ్డి చెప్పారు హాకీ గ్రీన్ టార్పెట్ స్విమ్మింగ్ పూల్ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్ల తెలిపారురాష్ట్ర స్పోర్ట్స అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి మాట్లాడుతూ 2032 లో భారత దేశానికి వచ్చే గోల్డ్ కప్ లలో ఒకటి వనపర్తి జిల్లా నుండి కొట్టి ఉండాలని .. వనపర్తి క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.గెలుపు ఓటముల మధ్య తేడాచాలా స్వల్పంగా ఉంటుందని, ఆ తేడాను అధిగమించిన వారు విజేతలుగా నిలుస్తారని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని గ్రామస్థాయిలో ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికి తీసేందుకు సి.యం. కప్ గ్రామ, మండల నియోజకవర్గం జిల్లా స్థాయిలో నిర్వహించి బాగా రాణించిన వారికి రాష్ట్రస్థాయిలో పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు గ్రామస్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను వెలికి తీసి అకాడమీలో చేర్పించి నైపుణ్య శిక్షణ ఇచ్చి జాతీయ స్థాయిలో రాణించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో ఒక క్రీడా మైదానం ఏర్పాటు చేసి అవసరమైన క్రీడా సామాగ్రి అందుబాటులో ఉంచే విధంగా ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు క్రీడలకు రాష్ట్రంలో 840 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీసి రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు సి.యం. కప్ ను గ్రామ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదవకాశాన్ని గ్రామీణ విద్యార్థులు సద్వినియోగం చేసుకొని సి.యం. కప్ క్రీడల్లో భాగస్వాములు కావాల్సిందిగా పిలుపునిచ్చారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓటమి నుంచే గెలుపు ఎలా సాధ్యమో నేర్చుకోవచ్చన్నారు.
గత సి.యం. కప్ లో వనపర్తి క్రీడాకారులు రాణించి రన్నర్ గా నిలిచారని, ఈసారి విన్నర్ గా రావాలని తెలియజేశారు. పట్టణంలో బాడ్మింటన్ కోర్టు, జిమ్ తదితర ఏర్పాట్లు చేయడం జరిగిందని వీటిని సద్వినియోగం చేసుకొని క్రీడా నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు.జిల్లా ఎస్పీ సునీత రెడ్డి మాట్లాడుతూ నాలుగు గోడల మధ్య నేర్చుకునే పాఠాలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని కానీ క్రీడా మైదానంలో నేర్చుకొనే విషయాలు జీవితానికి కావాల్సిన నైపుణ్యం అందిస్తుందన్నారు జీవితంలో వచ్చే అనేక చాలెంజ్ లను సులువుగా గెలిచే విధంగా క్రీడలు నేర్పిస్తాయని తెలియజేశారుఓటమి కూడా ఆటలో ఒక భాగమే అని దాని నుండి గుణపాఠాలు నేర్చుకొని విజయం సాధించాలని సూచించారువనపర్తి మార్కెట్ కమిటి చైర్మన్ పి శ్రీనివాస్ గౌడ్ జిల్లా యువజన క్రీడల అధికారి సుధీర్ కుమార్ రెడ్డిడి.ఈ.ఓ అబ్దుల్ ఘని, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి అంజయ్య, డీఎస్పీ వెంకటేశ్వర రావు, తహసిల్దార్ రమేష్ రెడ్డి ఎస్.జి.ఎఫ్ సెక్రటరీ పొలమోని కుమార్, పిడి లు పి. ఈ టి లు, క్రీడాకారులు పాల్గొన్నారు
