పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో వాలీబాల్ పోటీలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా MRHS గ్రౌండ్లో మండల స్థాయి వాలీబాల్ పోటీలు సోమవారం జరిగాయి. జహీరాబాద్ సబ్ డివిజన్ డిఎస్పీ సైద చేతుల మీదుగా మదులైతండ జట్టుకు మొదటి బహుమతి, GB గార్డెన్ జట్టుకు ద్వితీయ, అల్గొల్ బాయ్స్ జట్టుకు తృతీయ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐ శివలింగం, ఎస్ఐ కె. వినయ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ చంద్రశేకర్, కానిస్టేబుల్స్ నర్సింలు, పృద్వి రాజ్ పాల్గొన్నారు.
