అభిమానుల్లో ఉప్పొంగిన ఉత్సాహం
ఎండపల్లి నేటి ధాత్రి
ఎండపల్లి మండల కేంద్రంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దపెల్లి పార్లమెంట్ సభ్యులుగా గడ్డం వంశీకృష్ణ పేరు వినిపించడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది దానికి తోడు ఒక శుభ కార్యo నిమిత్తం ధర్మపురి కి వస్తున్న చెన్నూర్ శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి కి పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గా అభిమానులు పిలుచుకుంటున్న గడ్డం వంశీకృష్ణకు అభిమానులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా అభిమానులు వివేక్ వెంకటస్వామికి గడ్డం వంశీకృష్ణ కి ఎండపల్లి మండల కేంద్రము ఎంపిటిసి సభ్యులు పిసిసి కార్యవర్గ సభ్యుడు మహ్మద్ బషీర్ ఆధ్వర్యంలో ప్రజలు,అభిమానులు మహిళా మణులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం సన్మానం చేశారు ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ గ్యారంటీలలో భాగంగా ఆరోగ్యశ్రీ కానీ,మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కానీ, గృహ జ్యోతి కానీ, 500 లకే సిలిండర్ కానీ,ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో 4 గ్యారంటీలు ఇప్పటికే పూర్తి చేసింది మరో పథకం త్వరలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించబోతున్నాం అర్హులైన నిరుపేదలందరికీ ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిరుపేదలందరికీ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని ,పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం అని చాటిచెప్పారు అలాగే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఫై మొగ్గు చుపుతున్నారని మమ్మల్ని తప్పకుండా ప్రజలు ఆదరిస్తారని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సంఖ్యలో ఎంపీ స్థానాలు గెలవబోతున్నామని చాటిచెప్పారు ఈ కార్యక్రమంలో ఎంపిటిసి, పీసీసీ కార్యవర్గ సభ్యులు మహ్మద్ బషీర్ గుల్లకోట ఎంపిటిసి గొల్లపల్లి శ్రీజ మల్లేష్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు మహిళా అభిమానులు పాల్గొన్నారు