75వ వన మహోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ
జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం లోని జైపూర్ మరియు భీమారం మండలంలో శుక్రవారం రోజున ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మరియు ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటించారు. 75వ వనమహోత్సవ వేడుకలలో పాల్గొనడానికి విచ్చేసిన చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి మరియు పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కి కలెక్టర్ దీపక్ కుమార్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. వన మహోత్సవ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎంపీ ,జైపూర్ మరియు నర్సింగాపూర్ ఉన్నత పాఠశాలల ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గాన్నీ కాలుష్య రహితంగా మార్చి పర్యవరణ హితంగా మార్చుకునే ఈ వనమహోత్సవ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.అనంతరం పార్లమెంటులో ప్రమాణస్వీకారం చేసి మొదటిసారి చెన్నూరు నియోజకవర్గానికి వచ్చిన ఎంపీ గడ్డం వంశిక్రిష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రజలందరూ కలసి ప్రకృతిపై మనకున్న మమకారాన్ని తెలియజేస్తూ మొక్కలు నాటి విజయవంతం చేయాలని కోరారు.
భీమారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు
భీమారం మండలం నర్సింగాపూర్ లో రూ.1.60 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబోయే 5కేవిఏ విద్యుత్ సబ్ స్టేషన్ కి,ఎంపిపి కార్యాలయానికి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశిక్రిష్ణ,మంచిర్యాల జిల్లా కలెక్టరు దీపక్ కుమార్, డి ఆర్ డి ఓ కిషన్,అడిషనల్ డి ఆర్ డి ఓ ధత్తరావ్,మండల స్పెషల్ ఆఫీసర్ గణపతి, జైపూర్ ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్,జైపూర్ తహసీల్దార్ వనజారేడ్డి, ఏ ఈ విద్యాసాగర్ , ఈజిస్ సిబ్బంధి , అంగన్వాడి టీచర్లు,విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు.