మంత్రులు పైకి చెప్పేదొకటి…వాస్తవంగా జరిగేది మరొకటి
ఉద్యోగుల కుదింపునకు చర్యలు
ఒక్కో విభాగం క్రమంగా ప్రైవేటీకరణ
ప్రైవేటీకరణకు నష్టాలను కారణంగా చూపుతున్న ప్రభుత్వం
క్యాప్టింగ్ గనులు లేకపోవడమే అసలు సమస్య
ఈ గనులను కేటాయించడంలో అడ్డంకులు ఏమిటో?
ప్రైవేటీకరించినా ఈ సమస్య తప్పదు కదా!
రాష్ట్రీయ ఇస్ఫాత్ నిగమ్ లిమిటెడ్`ఆర్‌ఐఎన్‌ఎల్ పేరుతో వ్యవహరించే విశాఖ స్టీల్ ప్లాంట్‌తో
హైదరాబాద్,నేటిధాత్రి:
ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్‌తో ముడివడి వుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా కొన్ని వేలమందికి ఇది ఉపాధి కల్పిస్తోంది. ఎంతో కష్టపడి సాధించుకున్న ఈ కర్మాగారం ప్రైవేటీకరణ దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నదంటూ వస్తున్న వార్తలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్నది. ఇందుకు ప్రధాన కారణం స్టీల్ ప్లాంట్ అంశం ఆంధ్రుల భావోద్వేగాలకు సంబంధించింది కావడమే! దీనిపై ఏపీలో ఏపార్టీ అధికారంలోకి వచ్చినా తీవ్ర సంకట పరిస్థితిని ఎదుర్కొంటున్నది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఏవిధమైన నిర్ణయం తీసుకోలేని నేపథ్యంలో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు తీవ్ర సంకట పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. 2021లో కేంద్ర మంత్రివర్గం ఈ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు ఆమోదం తెలిపినప్పటినుంచి నేటివరకు పెట్టుబడుల ఉపసంహరణ అంశంలో సందిగ్ధత కొనసాగుతూనే వుంది. అయితే గత అసెంబ్లీ ఎ న్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో, ఈ అంశంపై కేంద్రానికి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించే అవకాశాలున్నాయని కొన్ని మీడియా కథనాలు వెల్లడిరచినప్పటికీ, ఆ పరిస్థితి లేదన్నది స్పష్టమవుతోంది. ఎందుకంటే ఈ అంశాన్ని ప్రత్యర్థి వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ రాజకీయంగా తనకు అనుకూలంగా మలచుకుంటే, తాము తీవ్రంగా నష్టపోతామన్న సంగతి చంద్రబాబుకు తెలియంది కాదు. అందుకనే ఈ విషయంలో ఎటూ తేల్చకుండా ఆయన మౌనం పాటించడం వెనుక అసలు కారణం ఇదే. ఒకపక్క రాష్ట్ర బీజేపీ నాయకులు విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ నుంచి కాపాడాలని విజ్ఞప్తులు చేస్తుంటే, చంద్రబాబు నాయుడు ప్రేవేటీకరణ దిశగా అడు గులు ముందుకేసే పరిస్థితే వుండదు. ఈ ప్రైవేటీకరణ అంశం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయా ల్లో చాలా కీలకస్థానాన్ని ఆక్రమించుకోవడంతో, ఏ రాజకీయ పార్టీ కూడా దీనిపై స్పష్టమైన విధానంతో ముందుకెళ్లే పరిస్థితి కనిపించడంలేదు. రాజకీయంగా నష్ట కారకమైన ఈ అంశాన్ని నా న్చడం తప్ప వాటి ముందు మరో పరిష్కారం కనిపించడంలేదు.
గత మూడేళ్లుగా స్టీల్ ప్లాంట్‌లో కేవలం 60శాతం ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. పెట్టుబడులు లేక ఫర్నెస్‌లను మూసివేయాల్సి వచ్చింది. 2022 నుంచి బ్లాస్ట్‌ఫర్నెస్‌ా3 నిలిచిపోవడంతో రెండున్నర మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి ఆగిపోయింది. దీనికి తోడు విశాఖ ఉక్కు కర్మాగారంలో భాగమైన రాయబరేలి ఫోర్జ్‌డ్ వీల్ ప్లాంట్‌ను రూ.2వేల కోట్లకు అమ్మేశారు. ఇక విశాఖలో 25 ఎకరాల స్టీల్ ప్లాంట్ స్థలాన్ని ప్లాట్లు చేసి అమ్మకానికి సిద్ధం చేశారు. చెన్నై, హైదరాబాద్‌లోని ఉక్కు యార్డులతో పాటు, వివిధ నగరాల్లోని కార్యాలయ భవనాలను రూ.475కోట్లకు అమ్మకాల కు ప్రతిపాదనలు సిద్ధమైనాయి. స్టీల్ ప్లాంట్‌కు చెందిన ఫైర్ స్టేషన్‌ను నడిపే బాధ్యతను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయించారు. ఇందుకోసం యాజమాన్యం ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ దరఖాస్తులను ఆహ్వానించింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నగరం నడిబడ్డున అత్యంత విలువైన 19వేల ఎకరాలున్నాయి. వీటికోసం ఎంతోమంది సమయం కోసం ఎదురుచూస్తున్నారు. విచిత్రమేమంటే జులై నెలాఖరులో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి స్టీల్‌ప్లాంట్‌ను సంద ర్శించి వెళ్లారు. ఈ సందర్భంగా ‘స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు. 45రోజుల్లో సమస్యల న్నీ చక్కబడతాయి’ అని చెప్పి వెళ్లిపోయారు. కానీ జరుగుతున్న పరిణామాలకు, ఆయన ఇచ్చిన హామీకి అసలు పొంతనే కనిపించడంలేదు.
ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ సీఎండీగా వున్న అతుల్‌భట్‌ను ప్రభుత్వం విధులనుంచి తప్పించి, రిటై ర్మెంట్ వరకు సెలవుపై వెళ్లాలని ఆదేశించింది. ఇదే సమయంలో డైరెక్టర్లకు కమిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ బాధ్యతలు అప్పగించింది. దీంతో పైకి ప్రైవేటీకరణ వుండదని ప్రభుత్వం చెబుతున్నా, సైలెంట్‌గా ప్రైవేటీకరణ వైపునకు ప్రభుత్వం ఆడుగులు ముందుకేస్తున్నదని కార్మికుల ఆరోపణ. ఇందులో భాగంగానే ప్లాంట్‌లో ఉద్యోగుల సంఖ్యను కూడా భారీగా కుదించే అవకాశాలున్నా యంటున్నారు. ప్రస్తుతం 19వేలుగా వున్న ఉద్యోగుల సంఖ్య క్రమంగా 8వేలకు తగ్గిపోయే అవకాశాలున్నాయని భయపడుతున్నారు. ముఖ్యంగా సీఎండీని తప్పించడం కేవలం ప్రైవేటీకరణలో భాగమేనని చెబుతున్నారు. దీనికితోడు 2025 నాటికి 2500 మంది ఉద్యోగులకు వి.ఆర్.ఎస్. ప్రకటించే అవకాశముందని ఇందుకు అవసరమైన మొత్తాన్ని కూడా ప్లాంట్ యాజమాన్యం సి ద్ధం చేసిందన్న వార్తలు కార్మికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. నాగర్‌నార్ స్టీల్ ప్లాంట్‌లో నిపుణు లైన కార్మికులు లేరని, అనుభవజ్ఞులైన కార్మికులు కావాలని కోరిన వెంటనే 500 మందిని డి ప్యుటేషన్‌పై పంపడం కూడా క్రమంగా స్టీల్‌ప్లాంట్‌ను ఖాళీచేసే ప్రక్రియలో భాగమేనన్న అనుమా నాలు వ్యక్తమవుతున్నాయి.4200 మంది కాంట్రాక్టు కార్మికుల ఎంట్రీ, ఎగ్జిట్ పాస్‌లు ఇవ్వకుండా వారిని తొలగించేందుకు యాజమాన్యం యత్నించింది. ఇదిలావుండగా కేంద్ర ఉక్కుశాఖ స హాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఆమధ్య దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబ డుల ఉప సంహరణ విధానమే విశాఖ ఉక్కుకర్మాగారానికీ వర్తిస్తుందని చెప్పడం ప్రైవేటీకరణ తప్పదన్న బలమైన సంకేతాలిచ్చినట్లయింది. పోయిన ఆర్థిక సంవత్సరంలో విశాఖ స్టీల్ ప్లాంట్ రూ.2859కోట్ల నష్టాన్ని చవిచూసిందని, వరుసగా నష్టాలతో కునారిల్లుతున్న సంస్థను కేంద్రం ప్రైవేటీకరించాలని నిర్ణయించిందని ఆయన కుండబద్దలు కొట్టడంతో విశాఖ ఉక్కుకర్మాగారంపై వున్న దింపుడుకళ్లం ఆశకూడా పోయింది. నిజానికి 2000 సంవత్సరంలో అప్పటి ప్రధాని వాజ్ పేయి ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని తలపోసింది. అయితే ఈ ఆలోచనను మార్చుకొని, సంస్థ రుణాలను ఈ క్విటీలుగా మార్చాలని వాజ్‌పేయి సూచించారు. వడ్డీరేటు తగ్గింపు, జరిమానా వడ్డీ మాఫీ, షెడ్యూల్ చేసిన ప్రిన్సిపల్ మొత్తాలను ముందస్తుగా చెల్లించి వాజ్‌పేయి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌ను ఆదుకుంది.
దేశంలో క్యాప్టిక్ గనులు లేకుండా పనిచేస్తున్న ఏకైక స్టీల్ ప్లాంట్ ఇది. దీనివల్ల ముడిపదార్థం కొనుగోలు ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఇంతపెద్ద స్టీల్ ప్లాంట్ నిర్మించి, క్యాప్టిక్ గనులు కేటాయించకపోవడంలో మర్మం ఏమిటో అర్థంకాదు. క్యాప్టిక్ గనులు కలిగిన స్టీల్ ప్లాంట్లు ముడి ఇనుప ఖనిజానికి టన్నుకు రూ.1500 చెల్లిస్తుంటే, విశాఖ స్టీల్‌ప్లాంట్ రూ.7000 చెల్లిస్తోంది. స్టీ ల్ ప్లాంట్ నష్టాలకు ప్రధాన కారణం ఇదే! దీన్ని పరిష్కరించకుండా ప్రైవేటీకరించడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? ఎందుకంటే దీన్ని స్వాధీనం చేసుకున్న ప్రైవేటు సంస్థ కూడా ఇవే పరిస్థితులను ఎదుర్కొనాల్సి వుంటుంది కదా! అనవసర రాజకీయాలు, రాద్ధాంతాలు కాకుండా, సంస్థకు క్యాప్టిక్ గనులు కేటాయిస్తే సమస్య 90% వరకు పరిష్కారమవుతుంది. రాష్ట్ర బీజేపీ నేత లు ఒకపక్క ప్లాంట్‌ను కాపాడాలని కోరుతూనే, మరోపక్క ప్రైవేటీకరణ నిర్ణయం పూర్తయిందని చెబుతున్నారు. ఇది ఆ పార్టీ ద్వంద్వవైఖరినే సూచిస్తుంది. ఇక కర్మాగార కార్మిక యూనియన్లు సంస్థను సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. విషయాన్ని గమనిస్తే, ప్రైవేటీకరణ తప్ప సంస్థను కాపాడటానికి ఇతర మార్గాలేమైనా ఉన్నాయా అన్న అంశాన్ని ఎవరూ పట్టిం చుకున్నట్లు లేదు. కేవలం రాజకీయ ప్రయోజనాల ఆధారంగా ఆందోళనలు నిరంతరం కొనసా గేలా చేయడం తప్ప! వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం కానివ్వబోమని చంద్రబాబు ఎన్నికల వాగ్దానం చేశారు. కానీ ఆయన ప్రస్తుతం నోరుమెదపడంలేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మౌనాన్నే ఆశ్రయించారు. స్థానిక ఎంపీ భరత్ కూడా ఏమీ మాట్లాడటం లేదు. వీరందరి మౌనం ప్రైవేటీకరణకు అనుకూలమేనన్న అభిప్రాయాన్ని కలిగిస్తోంది.
1966లో ఆంగ్లోాఅమెరికన్ కన్సార్టియం సిఫారసు చేసినప్పటికీ విశాఖలో స్టీల్ ప్లాంట్‌ను నిర్మిం చకూడదని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నిర్ణయించడం, తెలుగువారిలో తీవ్ర ఆందోళన కలిగించింది. స్వాతంత్య్ర సమరయోధులు అమృతరావు, తెన్నేటి విశ్వనాథం నేతృత్వంలో వేలాది మంది విద్యార్థులు, కార్మికులు, సామాన్య ప్రజలు చేపట్టిన ఆందోళన సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో 12మంది మరణించడం, ఉద్యమం హింసాత్మక రూపాన్ని సంతరించుకోవడాని కి దారితీసింది. ఉక్కు కర్మాగారానికి మద్దతుగా 66మంది ఎమ్మెల్యేలు, 7గురు ఎంపీలు రాజీనా మాలు చేశారు. దీంతో ఇందిరాగాంధీ మెట్టు దిగక తప్పలేదు. ఆవిధంగా దేశంలో మొట్టమొదటి తీరప్రాంత ఉక్కుకర్మాగారం 1970లో స్థాపించబడిరది.