తెలంగాణ లోని అన్ని ప్రైవేట్ స్కూళ్లలో యధేచ్ఛగా రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన.
తెలంగాణ లోని అన్ని ప్రైవేట్ స్కూళ్లలో యధేచ్ఛగా రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నా! ప్రతి నెల టంచన్ గా నెల నెలా జీతాలు తీసుకుంటూ ,ప్రైవేట్ ఉద్యోగస్తుల హక్కులు కాపాడాల్సిన భాద్యతా యుతమైన పదవి లో ఉన్న అధికారులు కావాలని అమ్యామ్యా లకు ఆశ పడి నిబంధన లకు తూట్లు పొడుస్తున్నారని బి ఎస్ పి కార్మిక విభాగం రాష్ట్ర ఇంచార్జి చోళ్ళేటి మహేష్ బాబు ఒక ప్రకటన లో విమర్శించారు.
తెలంగాణా లోని అన్ని ప్రైవేట్ స్కూళ్లలో జరుగుతున్న రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన కు,ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యం తో పాటు,అధికారులు కూడా దానికి భాద్యులని,వారిపై వెంటనే న్యాయ పరంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
అన్ని జిల్లాల్లోని సంపన్న ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు అందులో పని చేసే టీచర్స్, & అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ లకు భారత రాజ్యాంగం మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన హక్కులు
1. కార్మిక సంఘాల చట్టం 1926 ప్రకారం సంఘాలను ఏర్పాటు చేసుకోకుండా బెదిరిస్తున్నారు.
2. వేతనాల చెల్లింపు చట్టం 1936 మరియు కనీస వేతనాల చట్టం 1948, మరియు సమాన ప్రతిఫల చట్టం ప్రకారం వాళ్లకు సరైన వేతనాలు కూడా ఇవ్వడం లేదు
3. బోనస్ చెల్లింపు చట్టం 1965 మరియు గ్రాట్యూటి చెల్లింపు చట్టం 1972, & ఉద్యోగ నష్ట పరిహార చట్టం కూడా యాజమాన్యం కావాలని అమలు చేయడం లేదు
4) . ఈ ఎస్ ఐ కార్మిక భీమా చట్టం 1948 మరియు కార్మిక భవిష్య నిధుల చట్టం 1952 మరియు ప్రసూతి ప్రయోజనాల చట్టం 1961. & అలాగే జీవో నెంబర్ (1) మరియు జీవో నెంబర్ (95) లను, సంపన్నులైన ప్రైవేట్ స్కూల్స్ యజమాన్యాలు కావాలని అమలు చేయడం లేదు. ఈ చట్టాలన్నిటిని ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ఉన్న జిల్లా విద్యాశాఖ మరియు మండల విద్యాశాఖ యంత్రాంగం కావాలని వాంటెడ్ గా అశ్రద్ధ చేస్తూ.సమ్మర్ హాలిడేస్ లో మరియు దసరా సెలవులలో మరియు సంక్రాంతి సెలవులలో అలాగే రెండవ శనివారం మరియు ఆదివారం సెలవులల్లో కూడ సెలవులు ఇవ్వకుండా ఉద్యోగస్తులను స్కూళ్లకు బలవంతం గా రప్పిస్తున్నారు. ఎస్ ఎస్ సి విద్యార్థులకు ప్రైవేట్ క్లాసెస్ పేరు చెప్పి రాత్రి 7 గంటల వరకు టీచర్స్ మరియు స్టాఫ్ లను స్కూల్ లల్లో బలవంతంగా పనిచేయిస్తున్నారు.
ఈ చట్టాలను భేఖాతరు చేస్తున్న సంపన్న స్కూల్స్ యాజమాన్యాల పై ఎలాంటి చర్యలు కావాలని, వాంటెడ్ గా తీసుకోవడం లేదు. తత్ఫలితంగా అందులో పనిచేసే ప్రైవేట్ స్కూల్ టీచర్ లకి అడ్మిన్ స్టాఫ్ కి చట్టబద్ధంగా న్యాయ బద్ధంగా రావాల్సిన హక్కులు అందడంలేదు.
కాబట్టి వెంటనే ఆయా సంపన్న యాజమాన్యం స్కూల్స్ పై పూర్తి విచారణ చేసి హక్కుల ఉల్లంఘన చేసిన సంపన్న స్కూల్ యాజమాన్యం లపై మరియు కావాలని విధులు సక్రమంగా నిర్వర్తించని విద్యాశాఖ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోగలరని బి ఎస్ పి కార్మిక విభాగం మరియు బహుజన కార్మిక సంఘం తరుపున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ను డిమాండ్ చేస్తున్నాం. …….
లేని యెడల న్యాయ పోరాటం చేయటానికి సిద్ధం గా ఉన్నామని ఆయన తెలిపారు.